ఎవరి చేతి రాతనైనా చదవడం చాలా ఈజీ. కానీ డాక్టర్ చేతిరాతను చదవడం చాలా కష్టం. ముఖ్యంగా వాళ్లు పేషెంట్లకు రాసే ప్రిస్క్రిప్షన్లు చాలామందికి అర్థం కావు. అవునండీ.! మీరు విన్నది కరెక్టే.. ఆ ప్రిస్క్రిప్షన్ కేవలం మెడికల్ స్టోర్‌లో పని చేసేవారికి మాత్రమే అర్ధమవుతుంది. సరే.! ఇదంతా వదిలేయండి. ఇక్కడ ఓ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ సామాన్యులకే కాదు.. మెడికల్ స్టోర్ వారికి కూడా అర్ధం కాలేదు. ఈ వైద్యుడి చేతిరాతను చూసి మెడికల్ షాపు వాళ్లు కూడా దెబ్బకు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఔట్ పేషెంట్ కోసం ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోని ఓ వైద్యుడు రాసిన ప్రిస్క్రిప్షన్ చూసి మెడికల్ స్టోర్ వాళ్లు దెబ్బకు షాక్ అయ్యారు. నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం వచ్చిన ఓ రోగికి.. డాక్టర్ అమిత్ సోనీ కొన్ని మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాశాడు. అవి మెడికల్ షాపులో తీసుకోమని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రి పక్కనే ఉన్న మెడికల్ స్టోర్‌కు వెళ్లగా.. అక్కడున్నవారు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అనంతరం అర్థంకాని భాషలో రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ ఫోటో వైరల్‌గా మారడంతో సదరు డాక్టర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్.కె. తివారీ మాట్లాడుతూ, ”ఇది మా దృష్టికి కూడా వచ్చింది. అవును నిజానికి డా. అమిత్ సోనీ రాసిన ప్రిస్క్రిప్షన్ ఎవరూ చదవలేరు. అతడికి నోటీసులు జారీ చేశాం. సమాధానం రాగానే చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
MP Gajab News : सतना के डॉक्टर साब ने ऐसा लिखा पर्चा कि ‘खुद लिखे खुदा बांचे’ वाली कहावत हो गई, देखें वायरल हो रहा Prescription#Satna #Doctor #Viral #Prescription @healthminmp #MPNews #PeoplesUpdate pic.twitter.com/VCoYRoFpRJ
— Peoples Samachar (@psamachar1) September 6, 2024