Viral News: ఒక వధువుతో పెళ్లి నిశ్చయమైతే.. మరొక వధువుతో పెళ్లి అవడం, ఒక వరుడితో వివాహం ఫిక్స్ అయితే.. మరో వరుడితో పెళ్లి జరిగిపోవడం ఇవన్నీ సినిమాల్లోనే చూసుంటాం. కానీ, ఇలాంటి ఘటన నిజంగానే జరిగితే.. ఆ ఘటనకు కరెంట్ కారణం అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే, ఇక్కడ ఊహించుకోవడానికి ఏం లేదు.. నేరుగా చూసేయడమే మిగిలి ఉంది. అవును.. సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి సీన్లు.. తాజాగా ఓ జంట నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది. పెళ్లి సమయంలో కరెంట్ పోవడంతో.. ఒకరి మెడలో తాళి కట్టడానికి బదులు.. మరొకరి మెడలో తాళి కట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ ఇద్దరు కుమార్తెలు నిఖిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన అబ్బాయిలు దంగార్వా భోలా, గణేష్‌తో పెళ్లి నిశ్చయించారు. అయితే, సరిగ్గా మూహర్తం సమయంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వధూ వరులు బురఖాలో ఉండటం, ఇద్దరి దుస్తులు ఒకేలా ఉండటంతో పెద్ద పొరపాటే జరిగిపోయింది. ముహూర్తం సమయంలో కరెంట్ పోవడంతో.. ఈ గందరగోళం చోటు చేసుకుంది. నిశ్చయించిన జంట బదులు.. వేరు వేరు జంటలుగా కూర్చున్నారు. అలాగే పెళ్లి తంతు మొత్తం ముగిసింది. ఒకరికి బదులు మరొకరిని వివాహం చేసుకున్నారు. తాళి కట్టడం, పెళ్లి తంతు మొత్తం ముగిసిన తరువాత అసలు విషయం బయటపడింది. కొద్దిసేపు అక్కడ ఉద్విగ్నభరితమైన వవాతావరణం నెలకొంది. వాగ్వాదం జరిగింది. చివరకు మరోసారి పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చి.. సైలెంట్ అయ్యారు.