అవాక్కయ్యారా..! ఆయా జీతం అక్షరాల రూ.2కోట్లు.. ప్రైవేట్‌ జెట్‌లో విదేశీ టూర్లు..ఇంకా..

|

Dec 27, 2023 | 8:12 PM

కొన్నిసార్లు తనకు ప్రైవేట్ కారు, డ్రైవర్‌ను కూడా కేటాయించేవారని చెప్పింది. ఇదంతా తన అదృష్టంగా చెప్పింది సోన్యా. ఆమె మొదట 17 సంవత్సరాల వయస్సులో నానీగా పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె రెస్టారెంట్ మేనేజర్‌గా కూడా పని చేసిందట.. అప్పుడు ఆమె ఉన్నత స్థాయి గవర్నెస్ కావడానికి పిల్లల సంరక్షణను అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆపై ఏజెన్సీలతో కలిసి పనిచేయటం ప్రారంభించింది.

అవాక్కయ్యారా..! ఆయా జీతం అక్షరాల రూ.2కోట్లు.. ప్రైవేట్‌ జెట్‌లో విదేశీ టూర్లు..ఇంకా..
London Nanny
Follow us on

సాధారణంగా ఉద్యోగం చేసే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆయాలను నియమించుకుంటారు. రోజంతా పిల్లలను చూసుకోవడం, వారిని స్కూల్‌కి తీసుకెళ్లడం నుండి వారి హోంవర్క్ చేయించడం వరకు ఆయాలు అన్ని పనులు చేస్తుంటారు. అలాంటి ఆయాలకు జీతం కూడా వేలల్లోనే ఉంటుంది. కొందరికీ రూ. 20,000 లేదంటే రూ. 25,000 ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది.. అయితే సోన్యా కుమారి అనే నానీ జీతం, ఆమె పొందుతున్న అదనపు సౌకర్యాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. సదరు ఆయా చెప్పిన సమాచారం మేరకు.. పూర్తి వివరాల్లోకి వెళితే…

లండన్‌లోని వింబుల్డన్‌కు చెందిన ఈ 28 ఏళ్ల నానీ A-ప్రస్థానం మామూలుగా ఉండదు. ప్రముఖులు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు, దౌత్యవేత్తల ఇళ్లలో పని చేస్తుంది. ఆమె తన పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు, ఆమె ది రిట్జ్ వంటి ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసి ఫస్ట్ క్లాస్‌లో క్రూయిజ్‌లలో ప్రయాణిస్తుంది. చిన్న పిల్లలను చూసుకోవడం, ఎక్కువ గంటలు పనిచేయడం కష్టం, కానీ వారి జీతాలు కూడా తదనుగుణంగా ఎక్కువగా ఉంటాయి. అలాగే, సోన్యా వార్షిక ప్యాకేజీ £200,000 (2 కోట్ల 11 లక్షలు) వరకు ఉంది.

సోన్యా చెప్పిన సమాచారం ప్రకారం.. మొదట్లో పిల్లలను చూసుకునే పని నాకు అస్సలు ఇష్టం లేదని అన్నారు. తర్వాత డబ్బు కోసం పార్ట్‌టైమ్ జాబ్‌గా చేశాను. నేను చేయాలనుకుంటున్నది ఇదే అని నాకు అర్థమైంది. నేను దీని కోసం ఒక కోర్సు చేసాను. కొన్ని ఏజెన్సీలతో సైన్ అప్ చేసాను. నేను ప్రదర్శించిన విధానాన్ని క్లయింట్లు ఇష్టపడ్డారు. ఫలితంగా 21 ఏళ్లకే నేను ఫుల్‌టైమ్ గవర్నస్‌గా మారాను. నేను చాలా ప్రసిద్ధ వ్యక్తుల కోసం పని చేసానని చెప్పింది. ఇదే నాకు గొప్ప గుర్తింపును ఇచ్చిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇంకా సోన్యా చెప్పిన ప్రకారం.. కొన్నిసార్లు క్లయింట్లు తమ పిల్లల కోసం ప్రతి పనికి డబ్బు చెల్లించడానికి వారి బ్యాంకు కార్డులను కూడా తనకే ఇచ్చేవారని చెప్పింది. కొన్నిసార్లు నాకు ప్రైవేట్ కారు, డ్రైవర్‌ను కూడా కేటాయించేవారని చెప్పారు. ఇదంతా తన అదృష్టంగా చెప్పింది సోన్యా. ఆమె మొదట 17 సంవత్సరాల వయస్సులో నానీగా పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె రెస్టారెంట్ మేనేజర్‌గా కూడా పని చేశారు. అప్పుడు ఆమె ఉన్నత స్థాయి గవర్నెస్ కావడానికి పిల్లల సంరక్షణను అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆపై ఏజెన్సీలతో కలిసి పనిచేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..