ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియో వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని భయానకంగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కొన్ని వీడియోస్ చూస్తే పడి పడి నవ్వేస్తారు.. గతంలో దెయ్యాలు.. మనషులు, జంతువులు మాయమవుతున్నాయంటూ పలు వీడియోస్ నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. చివరకు అందులో జరిగినవన్ని అవాస్తవం అంటూ పోలీసులు తెల్చీ చెప్పారు.. తాజాగా మరో షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఎంతో సరదాగా ఫెయిర్ లో ఎంజాయ్ చేస్తున్న బుడ్డొడు ఆకస్మాత్తుగా మాయమయ్యాడు.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా..
ఆ వీడియోలో కొందరు ఎగ్జిబిషన్‌లోని ఫెయిర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఇద్దరు చిన్నారులు ఫెయిర్ లో ఉండగా.. ఆకస్మాత్తుగా అందులోని ఓ చిన్నొడు కనిపించకుండా పోయాడు.. ఆ వీడియోను ఇటీవల ‘ది సన్’ ట్విట్టర్‌లో ఖాతాలో షేర్ చేశారు..
మలేషియాలోని జోహార్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నూర్ అఫ్రీనా రోస్నీ అనే 30 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కొడుకు ముయిజ్ అఫ్రీనాను వీడియో తీస్తుండగా.. తన కొడుకు పక్కనే ఉన్న మరో అబ్బాయి ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.. ఐదేళ్ల ముయిజ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో మరొక అబ్బాయి పక్కన కూర్చొని ఫెయిర్ ఎంజాయ్ చేస్తున్నాడు..అయితే, రైడ్ రెండవ లూప్ కోసం తిరిగే సమయానికి తన కొడుకు పక్కనే కూర్చున్న అబ్బాయి మళ్లీ కనిపించలేదని తెలిపింది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ అబ్బాయి ఎక్కడకు వెళ్లలేదని.. ఆ సీటులోని కిందకు వంగి కూర్చున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
Disappearing boy on fairground ride has everyone baffled – can you work out what’s going on? pic.twitter.com/PK1gWLrPuQ
— The Sun (@TheSun) June 10, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.