Viral Video: దిక్కులు చూస్తూ నడిస్తే ఇలాగే ఉంటుంది.. ధ్యాస మార్చిపోయిన సింహానికి ఊహించని షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వడం ఖాయం..

|

Sep 20, 2021 | 7:25 PM

దారి వెంట వెళ్తున్నప్పుడు.. వేరే ధ్యాసలో ఉండిపోతే.. ప్రమాదం జరగడం ఖాయం. ముఖ్యంగా దిక్కులు చూస్తూ వెళ్తే.. అడ్డంగా పడిపోతారు.  నడిచేటప్పుడనా.. లేదా

Viral Video: దిక్కులు చూస్తూ నడిస్తే ఇలాగే ఉంటుంది.. ధ్యాస మార్చిపోయిన సింహానికి ఊహించని షాక్..  ఈ వీడియో చూస్తే నవ్వడం ఖాయం..
Lion
Follow us on

దారి వెంట వెళ్తున్నప్పుడు.. వేరే ధ్యాసలో ఉండిపోతే.. ప్రమాదం జరగడం ఖాయం. ముఖ్యంగా దిక్కులు చూస్తూ వెళ్తే.. అడ్డంగా పడిపోతారు.  నడిచేటప్పుడనా.. లేదా వావానాలపై వెళ్తున్నప్పుడైనా.. మీ దృష్టి దారిపైనే ఉండాలంటారు. లేకపోతే… ప్రమాదాల భారిన పడాల్సి వస్తుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుందని  ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓ సింహం.. దారి వెంట వెళ్తూ.. మరోవైపు చూస్తూ వెళ్తూ.. పట్టు తప్పి నీళ్లలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఆ వీడియోలో రెండు సింహాలు.. పార్క్‏లో ఉన్న కాలువ పక్కన నడుస్తూ ఉన్నాయి. అయితే అందులో ఉన్న ఓ సింహం.. ఎదురుగా చూసుకోకుండా.. పక్కన ఎక్కడో చూస్తూ.. నడుస్తూ ఉంది. దీంతో నేలపై వేయాల్సిన అడుగు.. ఆ కాలువ చివరన వేయడంతో అది అదుపు తప్పి నీళ్లలో పడిపోయింది. వెంటనే వెనకాలే ఉన్న మరో సింహం దానిని రక్షించేందుకు ఆనేక విధాలుగా ప్రయత్నించగా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరకు అదే సింహం.. ఈదుతూ.. మరోవైపు వెళ్లీ ఒడ్డుకు చేరుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సింహం పట్టుతప్పడం చూసి నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియో 2018లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ మరోసారి ఇప్పుడు ఇంటర్నెట్‏లో ట్రెండ్ అవుతుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయ్యండి.

ట్వీట్…

Also Read:  వీకెండ్ పార్టీలో స్టార్ హీరోయిన్స్ రచ్చ.. ఒకే ఫ్రేమ్‏లో సమంత.. కీర్తి.. త్రిష.. గులాబీలతో ఫోజులు..

Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..

Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన