Viral Video: పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లోకి దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే?

ఆహారం కోసం వెతుక్కుంటూ గ్రామాల్లోకి ఎలుగుబంట్లు, చిరుతపులులు రావడం మనం చాలానే చూస్తుంటాం. కానీ మీరెప్పుడైనా సింహాలు జనావాసాల్లోకి రావడం చూశారా? ఇక్కడ అదే జరిగింది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలోకి ఓ సింహం ప్రవేశించి.. నేరుగా ఓ ఇంట్లోకి దూరింది. సింహం కదలికలను గమనించిన గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు దాన్ని పట్టుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లోకి దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే?
Asiatic Lion Strays into Village Home in Gujarat

Updated on: Oct 30, 2026 | 8:39 PM

మీరు ఇంట్లో ఉన్నప్పుడు.. సడెన్‌గా ఇంట్లోకి ఓ సింహం ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది.. ఊహకే అది ఎంతో భయంకరంగా ఉంది కదూ.. అచ్చం ఇక్కడో వ్యక్తికి అలాంటి సీనే ఎదురైంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, ఖంభా తాలూకా పరిధిలోని జూనా మాల్కనేస్ గ్రామంలో తెల్లవారుజామున ఒక సింహం చొరబడింది. పశువులను వేటాడుతూ గ్రామంలోకి వచ్చిన ఆ సింహం.. వాటిని చంపి తిన్న తర్వాత.. ఆ పక్కనే ఉన్న అమ్రూభాయ్ వరు అనే వ్యక్తి ఇంట్లోకి దూరింది. అక్కడే దాదాపు గంట పాటు తిష్టవేసింది.

అయితే ఇంట్లోకి వచ్చిన సింహాన్ని గమనించిన అమ్రూభాయ్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. వెంటనే శబ్దం చేయకుండా సింహం కంట పడకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అయితే ఇక్కడ అతని సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి. ఎందుకంటే సింహం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు వెంటనే అతను ఇంటి తలుపును లాక్ చేశాడు. ఆ తర్వాత గ్రామస్తులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు అధికారులు.

తర్వాత పశువైద్యుడి సహాయంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. దాన్ని సురక్షితంగా పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించింది. చాకచక్యంగా సింహానికి మత్తు ఇంజెక్షన్ (ట్రాంక్విలైజర్) ఇచ్చి అది స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం సురక్షితంగా దాన్ని బోనులో బంధించి అక్కడి నుంచి జసాధార్ యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించారు. అటవీ శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us