Viral Video: ఒకే ఒక్క క్షణం.. అంతా తలకిందులైంది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

|

May 14, 2022 | 5:31 PM

విధి ఎప్పుడు... ఎలా మనుషుల జీవితాలతో ఆడుకుంటుందో చెప్పలేం. ఆ కుర్రాడు కుటుంబానికి చేదోడు.. వాదోడుగా ఉండేందుకు క్యాటరింగ్ పని చేస్తున్నాడు.. ఆ రోజు కూడా పనికి వెళ్లాడు. అప్పటివరకే అంతా బానే ఉంది. కానీ...

Viral Video: ఒకే ఒక్క క్షణం.. అంతా తలకిందులైంది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Lift Accident
Follow us on

Trending Video: చెన్నై(Chennai) తిరువళ్లూరు(Thiruvallur) గుమ్మిడిపూండిలోని ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. కల్యాణ మండపంలో వైర్ తెగి ఒక్కసారిగా కిందపడిపోయింది లిఫ్ట్‌. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి వేడుకలో అతిథులకు లంచ్‌ ఏర్పాటు చేస్తున్నారు సిబ్బంది. భోజనాలకు సంబంధించిన వస్తువులను లిఫ్ట్‌లో పైకి చేరుస్తుండగా..ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. దాదాపు పైకి రీచ్‌ అయ్యారు. మరికొన్ని సెకన్లలో లిఫ్ట్ నుంచి దిగుతారనగా.. అంతలోనే ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా లిఫ్ట్‌లో ఉన్నవారిని రక్షించేందుకు కిందికి పరుగులు పెట్టారు. వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఒకరు మృతి చెందగా..గాయపడిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. చనిపోయిన యువకుడు 11వ తరగతి చదువుతున్నాడని.. పార్ట్ టైమ్ జాబ్ కింద క్యాటరింగ్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆ లిఫ్ట్‌కి గేట్ లేని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు స్పాట్‌కి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సరైన నిబంధనలు పాటించని కళ్యాణ మండపం యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపం మేనేజర్, లిఫ్ట్ ఆపరేటర్, క్యాటరింగ్ కాంట్రాక్టర్ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్ వైర్ తెగిపోయిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.