మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..

కర్ణాటకలోని ఓ ఆలయ హుండీలో లభించిన రూ.20 నోటు సంచలనం సృష్టించింది. ఆ నోటుపై "వచ్చే ఏడాది జాతరకు ముందే నా అత్తగారు చనిపోవాలి" అనే వింత కోరిక రాయబడి ఉంది. ఆలయ నిర్వాహకులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు కుటుంబ ఉద్రిక్తతలు కారణంగా భావిస్తే, మరికొందరు దీనిని కేవలం జోక్‌గా కొట్టిపారేస్తున్నారు.

మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..
Let My Mother In Law Die

Updated on: Feb 24, 2026 | 7:08 PM

20 రూపాయల నోటుతో పాటు ఒక చిన్న కాగితం ముక్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ నోట్‌పై రాసి వున్న ఒక సందేశం కారణంగా ఇప్పుడా అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. అది కూడా ఒక ఆలయంలోని విరాళాల పెట్టెలో కనిపించడం మరింత దిగ్భ్రాంతికరంగా మారింది. విస్తృతంగా వైరల్‌ అవుతున్న ఈ ఫోటో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తన అత్తగారి చావును కోరుకుంటూ దేవుడిని వేడుకుంటూ రాసిన కోరికను తెలియజేస్తుంది.

ఈ సంఘటన ఇటీవల కర్ణాటకలోని కలబురగిలోని అఫ్జల్‌పూర్ తాలూకా కటదర్గి ప్రాంతంలో ఉన్న భాగ్యవంతి దేవి ఆలయంలో చోటుచేసుకుంది. ఇటీవల ఆలయంలో ఒక జాతర జరిగింది. జాతర తర్వాత కానుక పెట్టె తెరిచి డబ్బులు లెక్కపెడుతున్నప్పుడు, ఈ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, దేవా నా దుఃఖాన్ని తొలగించు… వచ్చే ఏడాది జాతరకు ముందే నా అత్తగారు చనిపోవాలి ఈ సందేశాన్ని చదివి ఆలయ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణంగా భక్తులు కానుకల పెట్టెలో కుటుంబం ఆనందం, శాంతి, ఉద్యోగం, పిల్లలు, డబ్బు, ఆరోగ్యం లేదా శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. అయితే, ఎవరికైనా మరణం కావాలని కోరిక వ్యక్తం చేయడం, దానిని దేవుని ముందు సమర్పించడం చాలా అరుదు.

ఆ నోట్ పై పేరు లేదా ఇతర ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ఆ సందేశాన్ని కోడలు రాసిందా లేక అల్లుడు రాశాడా అనేది కూడా స్పష్టంగా తెలియదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తమ ఇనెళ్ల వృత్తి జీవితంలో ఇలాంటి కొత్త, వింత డిమాండ్ ఎప్పుడూ చూడలేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామంలో చర్చ మొదలైంది. దీనిపై ప్రజలు భిన్నమైన కామెంట్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొందరు దీనిని తీవ్రమైన కుటుంబ ఉద్రిక్తత ఫలితంగానే ఇలాంటి కోరిక వ్యక్తం చేశారని భావిస్తున్నారని, మరికొందరు ఇది ఎగతాళి లేదా కోపంతో జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ సందేశం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఆలయ నిర్వహకులు మాత్రం ఆ నోటును కేవలం వింత ప్రార్థనగా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ఇది దర్యాప్తుకు సంబంధించిన విషయం కాదు. ప్రతి భక్తుడు తమ భావాల ప్రకారం విరాళాల పెట్టెలో ఏదో ఒకటి సమర్పిస్తారు. ఈ మెసేజ్ కూడా దానిలో ఒక భాగం. కానీ ఇది కొంచెం భిన్నంగా, షాకింగ్‌గా ఉందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us