చిరుత పులి ఈ పేరు వింటేనే వణుకొస్తుంది. ఈ మధ్యకాలంలో చిరుతలు గ్రామాల్లోకి రావడం పశువుల పై దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే జనావాసంలోకి వచ్చిన కొన్ని చిరుతలు మనుషుల పై కూడా దాడి చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. పాపం దాహం వేసిందేమో బిందెలో తల పెట్టింది అంటే అది కాస్త ఇరుక్కుపోయింది. దాంతో విలవిలలాడింది. ఈ సంఘట మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. గ్రామంలో తిరిగిన చిరుత అలసిపోయి నీరు తాగడానికి బిందెలో తల పెట్టింది. తల పెట్టడం బాగానే పెట్టింది కానీ దాన్ని బయటకు తీయలేకపోయింది. దాంతో పాపం చిరుత లబోదిబోమంది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. దాంతో బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది చిరుత. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..