ఆమె ఐఏఎస్, అతనో ఐపీఎస్.. ఆఫీస్‌లోనే సింపుల్‌గా జరిగిపోయిన ప్రేమ‌-పెళ్లి సంచ‌ల‌నం..

|

Aug 13, 2023 | 10:52 AM

గతంలో ఇలాంటి మరో సంఘటనలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ను తిరుపతిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, నవీన్ కుమార్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆమె ఐఏఎస్, అతనో ఐపీఎస్.. ఆఫీస్‌లోనే సింపుల్‌గా జరిగిపోయిన ప్రేమ‌-పెళ్లి సంచ‌ల‌నం..
Krishna District Jc Ideal M
Follow us on

సాధారణంగా ఈ ఐఏఎస్ అధికారులు తమ పెళ్లికి మరో ఐఏఎస్ అధికారిని ఎంచుకుంటారు. ఈ ఐఏఎస్‌లు తమ శిక్షణ సమయంలో తమ బ్యాచ్‌మేట్‌గా ఉన్న మరో ఐఏఎస్ అధికారిని ప్రేమించి, ఐఏఎస్ ఆఫీసర్ శిక్షణ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవడం మనం ఎక్కువగా చూశాం. ఇది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే మరో ఐఏఎస్ అధికారి మాత్రమే ఐఏఎస్ పోస్టు బాధ్యతలను బాగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది. కానీ, ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఒక మహిళా అధికారి తన కార్యాలయంలో ట్రైనీ IPS అధికారిని వివాహం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ ట్రైనీ ఐపీఎస్ అధికారిని వివాహం చేసుకోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్‌కి స్టేట్‌ కేడర్‌ ట్రైనీ ఐపీఎస్‌ అధికారితో తన కార్యాలయంలో నిరాడంబరంగా వివాహం జరిగింది. ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్ల వివాహాలు సాధారణంగా విశిష్ట అతిథుల సమక్షంలో గొప్ప వేడుకగా జరుగుతాయి. కానీ, ఈ పెళ్లి అన్ని ఆడంబరమైన వివాహాల కంటే చాలా భిన్నంగా, చాలా సరళంగా జరిగింది. జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ సిన్సిన్వార్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ ల అసాధారణ పెళ్లి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా చర్చనీయాంశమైంది. ఈ సాధారణ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు అధికారులు తమ వివాహాన్ని నమోదు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దంపతులు పూల మాలలు మార్చుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వివాహానికి సిబ్బంది హాజరయ్యారు. ఐఏఎస్ అధికారిణి అపరాజితా సింగ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి దేవేంద్రకుమార్ దంపతులు పూల మాలలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు అధికారులు చాలా సంతోషంగా ఉన్నారని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు, కలెక్టరేట్ సిబ్బంది నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ట్రైనీ ఐపీఎస్ అధికారి దేవేంద్ర కుమార్ రాజస్థాన్‌కు చెందినవారు. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతుండగా, ఐఏఎస్ అధికారి అయిన అపరాజితా సింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో ఇలాంటి మరో సంఘటనలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ను తిరుపతిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, నవీన్ కుమార్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..