Viral Pic: మీరు సూపర్ సార్.. కోల్‌కత్తా ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వర్షం..

|

Sep 22, 2021 | 1:13 PM

సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో రియల్ హీరో వెలుగులోకి వస్తున్నాడు. తాజాగా కోల్‌కత్తాకు చెందిన మంచి మనసున్న ఓ ట్రాఫిక్ పోలీసు రియల్ లైఫ్ హీరో అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Viral Pic: మీరు సూపర్ సార్.. కోల్‌కత్తా ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
Kolakta Police
Follow us on

Viral News: సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో రియల్ హీరో వెలుగులోకి వస్తున్నాడు. తాజాగా కోల్‌కత్తాకు చెందిన మంచి మనసున్న ఓ ట్రాఫిక్ పోలీసు.. రియల్ లైఫ్ హీరో అంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ అందరూ మెచ్చుకునేలా ఆ ఖాకీ చేసిన మంచిపని ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. కోల్‌కత్తాలో కుండపోత వర్షం కురుస్తుండగా ఓ ట్రాఫిక్ పోలీసు గొడుగు పట్టుకుని నడిరోడ్డుపై నిల్చొని విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నాడు. అదే సమయంలో రెండు వీధి కుక్కలు భారీ వర్షంలో ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలియక ఆ ట్రాఫిక్ పోలీస్ గొడుగు కిందకొచ్చి నిల్చొన్నాయి. ట్రాఫిక్ పోలీసు కూడా వాటిని తరిమికొట్టకుండా.. తన గొడుగు కింద వాటికి ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. భారీ వర్షంలో ట్రాఫిక్ పోలీస్ గొడుగు కింద రెండు వీధికుక్కలు కూడా నిల్చొని ఉన్న ఫోటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అటు కోల్‌కత్తా పోలీసులు కూడా ఈ ఫోటోను తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. మంచి మనసున్న ఆ ట్రాఫిక్ పోలీస్..కానిస్టేబుల్ తరుణ్ కుమార్ మండల్‌గా వెల్లడించారు.

అటు ఈ ఫోటో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. భారీ వర్షంలో రెండు వీధి కుక్కులకు తన గొడుగు కింద ఆశ్రయం కల్పించిన ట్రాఫిక్ పోలీస్‌ది ఎంతో గొప్ప మనసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ పోలీసులు అందించే సేవలు అమోఘమంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్స్ ప్రశంసల ట్వీట్స్..

Also Read..

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి 8 లక్షల యాప్స్ ఔట్.. వీటిని వెంటనే డిలీట్ చేసేయండి..

 గ్రామ సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడ్ని నడిరోడ్డులో బూటుకాలితో తన్నిన సర్పంచ్.!