Viral Video: కింగ్ కోబ్రాను రక్షించబోయి షాక్ తిన్న యువకుడు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

|

Sep 08, 2021 | 6:29 PM

Snake Viral Video: పాము పేరు వింటేనే ప్రజలు భయపడిపోతారు. అలాంటిది మీరు కింగ్ కోబ్రా చేతుల్లో చిక్కుకున్నట్లయితే.. ఆ ఊహను ఊహించుకోవడానికే వెన్నులో..

Viral Video: కింగ్ కోబ్రాను రక్షించబోయి షాక్ తిన్న యువకుడు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Follow us on

పాము పేరు వింటేనే ప్రజలు భయపడిపోతారు. అలాంటిది మీరు కింగ్ కోబ్రా చేతుల్లో చిక్కుకున్నట్లయితే.. ఆ ఊహను ఊహించుకోవడానికే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది కదా.! వాస్తవానికి కింగ్ కోబ్రా విషం మనిషి శరీరంలో వేగంగా వ్యాపిస్తుందని మనందరికీ తెలుసు. అది మనిషిని క్షణాల్లో చంపేస్తుంది. ఇక తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసిన తర్వాత కింగ్ కోబ్రా ఎంత డేంజరసో మీకు అర్ధమవుతుంది.

ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి పాములు రావడం సర్వసాధారణం. కొంతమంది కర్రలతో వాటిని తరిమేస్తుంటే.. మరికొందరు స్నేక్ క్యాచర్స్ సహాయం తీసుకుంటారు. ఇక పాములను రెస్క్యూ చేసే స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రాను పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దాని తోకను పట్టుకుని లాగాడు. అంతే ఇంకేముంది..! ఠక్కున ఆ కోబ్రా బుసలు కొడుతూ.. పడగెత్తి మరీ బయటికి వచ్చింది. దీనితో ఆ వ్యక్తితో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. తృటిలో కోబ్రా కాటు నుంచి అతడు తప్పించుకున్నాడని చెప్పొచ్చు.

ఈ భయానక వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ”పామును ఇలా పట్టుకోకూడదు.. ముఖ్యంగా కింగ్ కోబ్రాను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది. పామును పట్టుకున్న వ్యక్తి పేరు అశోక్ కాగా.. వీడియోలో కనిపించిన కింగ్ కోబ్రా సుమారు 14 అడుగులు పొడవు ఉన్నది అని సమాచారం. కాగా, చివరికి అతడు చాకచక్యంగా ఆ పామును పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘పామును రెస్క్యూ చేయడం ప్రమాదకరమైన పని’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఇలాంటివి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ” మరొకరు కామెంట్ చేశారు.