Jewellery brand’s viral ad: దేశంలో అసమానతల సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తుంటాయి. ఇలాంటి క్రమంలో ట్రాన్స్‌జెండర్ మోడల్ నటించిన భారతీయ సాంప్రదాయ ఆభరణాల ప్రకటన ఎందరో హృదయాలను గెలుచుకుంటోంది. ఒక నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ ట్రాన్స్‌జెండర్ కథను చాలా అపురూపంగా చూపించారు. ఓ యువ ట్రాన్స్‌జెండర్ ఓ అందమైన వధువుగా ఎలా రూపాంతరం చెందింది అనే కథను.. స్వచ్ఛమైన ప్రేమ పేరుతో అద్భుత సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రాన్స్‌జెండర్ అని తెలిసిన తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా లభించిందనేది ఈ జ్యూవెలరీ యాడ్‌లో చూపించారు. ఈ యాడ్.. కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ భీమా చిత్రీకరించింది. యువకుడి విషయం గురించి తెలుసుకున్న కుటుంబం ఎలా స్పందిస్తుంది. ఆమెపై ఎలాంటి ప్రేమను కనబరుస్తారు అన్న విషయాన్ని చూపిస్తారు. ఓ యువ ట్రాన్స్‌జెండర్ మీసాలు, గడ్డం, శరీరంలో వచ్చే మార్పులతో ఇబ్బంది పడుతూ.. అందమైన వధువుగా మారే క్రమాన్ని చూపించారు. ఈ క్రమంలో ఆమె జీవితంలోని ప్రతీ ప్రత్యేక సందర్భంలోనూ తల్లిదండ్రులు బంగారు నగలను ఇవ్వడాన్ని దీనిలో చిత్రీకరించారు. అయితే.. ఈ ప్రకటన వీడియోను బీమా జ్యువెలరీ.. ప్యూర్ యాస్ లవ్ పేరుతో విడుదల చేసింది.
ప్యూర్ యాజ్ లవ్ పేరుతో ఈ యాడ్ ఏప్రిల్‌లో విడుదలైనప్పటి నుంచి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈయాడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఈ యాడ్‌కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. లింగబేధం అంశాలు తెరపైకి వస్తున్న క్రమంలో.. ఇలాంటి వీడియోను.. యాడ్‌గా విడుదల చేయడంపై నెటిజన్లు బీమా జ్యూవెలరీని కొనియాడుతున్నారు.
అయితే.. దీనిలో 22 ఏళ్ల మీరా సింఘానియా రెహానీ ప్రధాన పాత్రలో కనిపించింది. మోడల్ అయిన మీరా ఢిల్లీ యూనివర్సిటీలో సోషియాలజీలో పీజీ చేస్తోంది. ఈ యాడ్ గురించి విని ముందు కంగారుపడ్డానని ఆ తర్వాత ఒప్పుకున్నట్లు మీరా పేర్కొంది. వాణిజ్యపరమైన అంశాల కోసం తన ట్రాన్స్ ఐడెంటిటీ ఉపయోగపడాలని అనుకోలేదని.. కానీ.. డైరెక్టర్ కథను చెప్పిన అనంతరం ఒప్పుకున్నట్లు తెలిపింది.
Also Read: