Watch: బస్సు డ్రైవర్‌కు తప్పని హెల్మెట్‌.. ఇకపై ఇదే ట్రెండ్‌ అవుతుందేమో మరీ..! కారణం ఏంటంటే..

Bharat Bandh: ఈ బంద్ ద్వారా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. ఇది దేశ ఆర్థిక, రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం రోడ్లపై స్పష్టంగా కనిపించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో బంద్ మిశ్రమ ప్రభావం కనిపించింది.. వామపక్ష పాలిత కేరళలో సాధారణ బంద్ పాటించారు. అక్కడ దుకాణాలు మూసివేయబడ్డాయి. రోడ్లను దిగ్బంధించడం ద్వారా బంద్‌కు మద్దతుగా నిరసనలు, ఊరేగింపులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక విభిన్నమైన దృశ్యం కనిపించింది.

Watch: బస్సు డ్రైవర్‌కు తప్పని హెల్మెట్‌.. ఇకపై ఇదే ట్రెండ్‌ అవుతుందేమో మరీ..! కారణం ఏంటంటే..
Bus Driver Wearing Helmet

Updated on: Jul 09, 2025 | 4:58 PM

జులై 9న దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టారు. భారత్ బంద్ అనేది రైతులు, కార్మికుల హక్కుల కోసం చేపట్టిన ఒక గొప్ప కార్యచరణ. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎదురయ్యే సమస్యలను బలంగా ఎత్తిచూపడమే దీని లక్ష్యం. నాలుగు కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నిరసనగా ఈ బంద్ చేపట్టారు.. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. ఇది దేశ ఆర్థిక, రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం రోడ్లపై స్పష్టంగా కనిపించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో బంద్ మిశ్రమ ప్రభావం కనిపించింది.. వామపక్ష పాలిత కేరళలో సాధారణ బంద్ పాటించారు. అక్కడ దుకాణాలు మూసివేయబడ్డాయి. రోడ్లను దిగ్బంధించడం ద్వారా బంద్‌కు మద్దతుగా నిరసనలు, ఊరేగింపులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక విభిన్నమైన దృశ్యం కనిపించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

భారత్‌ బంద్, కానీ సర్వీసులు మూసివేయబడకూడదు. డ్రైవర్ ప్రభుత్వ బస్సు ఎక్కాలి. అయితే, ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడుపుతున్నాడు. ఈ దృశ్యం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో కనిపించింది. సిలిగురిలో కూడా ఇదే దృశ్యం కనిపించింది. భారత్ బంద్ ప్రభావాల నుండి తప్పించుకోవడానికి ఇది ఒక ప్రయత్నంగా అక్కడి అధికారులు భావించారు.

డ్రైవర్ శిబు థామస్, పతనంతిట్ట నుండి కొల్లం రూట్ కు బస్సు నడుపుతాడు. ప్రతిరోజు లాగే, ఈరోజు కూడా అతను బస్సును బయటకు తీయాలి. అయితే, అతను రోడ్డుపైకి వెళ్ళిన వెంటనే, అతనికి బంద్‌ తీవ్రత స్పష్టంగా కనిపించింది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో తన ప్రాణాలకు భయపడి నిరసనకారుల దాడి నుంచి తప్పించుకునేందుకు గానూ అతడు తలకు హెల్మెట్ ధరించి బస్సును నడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వీడియో ఇక్కడ చూడండి…

దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌కు కారణం ఏంటనే విషయానికి వస్తే…

– కొత్త చట్టాలు కార్మిక హక్కులను తగ్గిస్తున్నాయని AITUC ఆరోపణ.
– ధరలు పెరుగుతున్నందున ప్రజలకు ఇబ్బందులు.
– ఆరోగ్యం, విద్య, పౌర సేవల బడ్జెట్ తగ్గింపు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వ్యతిరేకత.
– రైతులకు సరైన ధరలు లేకపోవడం, వ్యవసాయ విధానాల్లో అసంతృప్తి.
– మహారాష్ట్ర పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు పౌర హక్కులపై ఆందోళన.
– గత 10 ఏళ్లుగా భారత కార్మిక సదస్సు నిర్వహించలేదు.
– AITUC సహా యూనియన్ల 17 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…