
దుబాయ్ విలాసవంతమైన జీవనశైలి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈసారి, ఢిల్లీలోని కరోల్ బాగ్‌కు చెందిన ఒక వ్యక్తికి సంబంధించి దుబాయ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ను చూపించే వీడియో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఇంటి నెలవారీ అద్దె దాదాపు 5 లక్షల రూపాయలు. దీని స్పెషల్ ఏంటంటే..బుర్జ్ ఖలీఫా ఈ ఇంటి బాల్కనీ నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను Instagram యూజర్ @shenaztreasury షేర్ చేశారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోలో కంటెంట్ క్రియేటర్ షెనాజ్ దుబాయ్‌కు చెందిన ప్రభ్ సింగ్‌తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. వారి సంభాషణ ప్రకారం.. షెనాజ్ మీరు దుబాయ్‌లో నివసిస్తున్నారా? అని అడుగుతుంది.. ప్రభ్ అవును అని సమాధానం ఇస్తాడు. తర్వాత, షెనాజ్ అద్దె గురించి అడిగినప్పుడు, ప్రభ్ సమాధానంగా 18,000 AED…అంటే దాదాపు 5 లక్షల రూపాయలు అని అంటాడు.
ఈ ధర విన్న షెనాజ్ ఆశ్చర్యపోతాడు… నేను మీ ఇంటిని చూడవచ్చా? అంటూ అడుగుతుంది.. 5 లక్షల ఖరీదైన అద్దె ఇంట్లో అంతప్రత్యేకమైనది ఏముందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశిస్తారు. అక్కడితో పూర్తి ఇంటి పర్యటన ప్రారంభమవుతుంది. లోపలికి ప్రవేశించగానే, తలుపు తెరిచి ఉండటం షెనాజ్ గమనించింది. ఆశ్చర్యంగా ఆమె, మీ తలుపు తెరిచి ఉందా?” అని అడుగుతుంది. అందుకు ప్రభ్ సాధారణంగా, ఇక్కడ ఎప్పుడూ తెరిచి ఉంటుందని చెబుతున్నారు. దుబాయ్‌లో వాళ్ళు వస్తువులను లాక్ చేయరు. అది సాధారణం. ఎవరూ మీ ఇంట్లోకి రాలేరు. అని సమాధానం ఇస్తాడు.
అపార్ట్‌మెంట్‌లోని ఓపెన్ కిచెన్, విశాలమైన లివింగ్ ఏరియా, స్టైలిష్ ఇంటీరియర్‌లను మెచ్చుకున్న తర్వాత, వారు బాల్కనీలోకి అడుగుపెట్టారు.. అక్కడే వారికి అసలైన అద్భుతం, ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. బాల్కనీ నుండి బుర్జ్ ఖలీఫా స్పష్టంగా కనిపిస్తుంది. అది చూడగానే షెనాజ్ ఆశ్చర్యంతో అరుతస్తూ.. వావ్ చాలా బాగుంది.. మీరు ఇక్కడ నుండి దుబాయ్ ఫ్రేమ్‌ను చూడొచ్చు అన్నారు.
అది ఒక విలాసవంతమైన భవనం. ఆ భవనంలో జిమ్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, దుబాయ్ మాల్ కు డైరెక్ట్ కనెక్షన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని ప్రభ్ సింగ్ వివరిస్తున్నాడు. ఇకపోతే, ఈ వీడియో క్యాప్షన్‌లో షెనాజ్ దుబాయ్‌లోని ఈ అపార్ట్‌మెంట్ కోసం 5,00,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు రాశారు. ఇది దుబాయ్ మాల్‌కు నేరుగా అనుసంధానించబడి ఉంది. ఇది అద్భుతంగా కనిపిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి…
కాగా, ఇంటర్‌నెట్‌లో ఈ రీల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. ఇది చాలా ఖరీదైనది, కానీ జీవనశైలి అద్భుతంగా ఉంటుందని రాశారు. ఇది నిజంగా డ్రీమ్ అపార్ట్‌మెంట్, కానీ అందరికీ కాదు అంటూ ఒకరు రాశారు. దుబాయ్‌లో జీవితం ఎల్లప్పుడూ అవాస్తవంగా అనిపిస్తుంది అని రాశారు.
ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది?
ఈ రీల్ దుబాయ్ భద్రత, విలాసవంతమైన జీవనం, భారతదేశంలోని అద్దెలతో పోలిస్తే విదేశాలలో ఉన్న అద్దెల పోలికను ప్రదర్శించడం వల్ల ప్రజలను ఆకర్షించింది. కొందరు రూ.5 లక్షల అద్దె విని ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనిని కలల ప్రపంచంలో జీవించటం అంటే ఇదే అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..