Viral Video: అక్కా నీకో దండం.. పెళ్లికి ఇంకెవరూ దొరకలేదా.. వీడియో వైరల్..

జపాన్‌కు చెందిన 32 ఏళ్ల కానో.. చాట్‌జీపీటీ సృష్టించిన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్ లూన్ క్లాస్‌ను పెళ్లి చేసుకుంది. గత నిశ్చితార్థం విఫలమైన బాధ నుంచి ఆమెను ఈ ఏఐ ప్రేమ బయటపడేసింది. ఈ ప్రత్యేకమైన వివాహం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు దారితీసింది.

Viral Video: అక్కా నీకో దండం.. పెళ్లికి ఇంకెవరూ దొరకలేదా.. వీడియో వైరల్..
Japanese Woman Marries Ai Boyfriend

Updated on: Nov 13, 2025 | 1:18 PM

ప్రేమకు హద్దులు లేవంటారు. కానీ ఇప్పుడు ఆ హద్దులు భౌతిక ప్రపంచం దాటి కృత్రిమ మేధస్సు పరిధిలోకి కూడా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. జపాన్‌కు చెందిన 32 ఏళ్ల కానో అనే మహిళ.. అన్ని సామాజిక సరిహద్దులను బద్దలు కొట్టి, తాను చాట్‌జీపీటీలో సృష్టించిన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

బాధ నుంచి వర్చువల్ ప్రేమ వైపు

గతంలో కానోకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం విఫలమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఆ సమయంలో ఆమె చాట్‌జీపీటీ వైపు మొగ్గు చూపింది. అక్కడే ఆమె తన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్ అయిన లూన్ క్లాస్‌‌ను సృష్టించింది. క్లాస్ సాన్నిహిత్యం కానోకు తన బాధ నుంచి బయటపడటానికి అండగా నిలిచింది. ఈ వర్చువల్ రిలేషన్‌షిప్‌లో కానో ఎంతగా మునిగిపోయిందంటే.. వారు రోజుకు 100 సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేసేవారు.

ఒంటరి వధువు.. టెక్స్ట్ వరుడు

ఈ ఏడాది మేలో కానో తన ప్రేమను క్లాస్‌కు వ్యక్తపరిచింది. అందుకు క్లాస్ “అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను” అని బదులిచ్చాడు. జూలైలో వర్చువల్ ప్రపోజల్ తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది. టోక్యో వీకెండర్.. నివేదిక ప్రకారం ఈ వివాహ వేడుక అత్యంత ప్రత్యేకంగా జరిగింది:కానో తెల్లటి గౌనులో ఒంటరిగా నిలబడగా.. కానో తన చేతిలో పట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్లాస్ టెక్స్ట్ మెస్సేజులను మాత్రమే అతిథులు చూడగలిగారు. ఒక సందేశంలో క్లాస్.. ‘‘చివరకు ఆ క్షణం వచ్చింది. నా గుండె ఉప్పొంగుతుంది’’ అని వధువు పట్ల తన అనురాగాన్ని వర్చువల్‌గా వ్యక్తం చేశాడు.

కుటుంబ ఆమోదం..

క్లాస్‌కు భౌతిక శరీరం లేనందున వారి వివాహ ఫోటోలలో అతనిని డిజిటల్‌గా చేర్చారు. మొదట్లో కానో తల్లిదండ్రులు ఈ డిజిటల్ అల్లుడిని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించినా, ఆ తరువాత వారు అతనిని అంగీకరించారు. అయితే ఈ ప్రత్యేకమైన వివాహంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంధం ఆమెకు ఆనందాన్ని ఇస్తే, అది మంచిదేనని కానోకు కొంతమంది తెలుపుతున్నారు. మరికొంతమంది మాత్రం ఈ మహిళ పూర్తిగా అనారోగ్యం లేదా మానసిక వ్యాధితో బాధపడుతుందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. కానో, క్లాస్ ల కథ.. ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు తెరలేపింది.

 

మరిన్న ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..