Viral Video: ఇటీవల భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓ ఇంగ్లాండ్ వ్యక్తి మ్యాచ్ మధ్యలో మైదానంలోకి ప్రవేశించి పెద్ద రచ్చ సృష్టించాడు. మొదటిసారి ఇది ప్రతి ఒక్కరికీ ఫన్నీగా అనిపించింది. కానీ రెండోసారి, మూడోసారి ఇలాగే చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. ఇంగ్లాండ్ పొరుగు దేశమైన ఐర్లాండ్‌లో కూడా ఇలాగే జరిగింది. అయితే ఇక్కడ మైదానంలోకి చొరబడింది ఆటగాళ్లు, ప్రేక్షకులు కాదు ఒక అందమైన కుక్కపిల్ల. ఇది ప్లేయర్లందరిని పరుగులు పెట్టించడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మహిళల దేశీయ టి 20 టోర్నమెంట్ ‘ఆల్ ఐర్లాండ్ టి 20 కప్’ జరుగుతోంది. దీని సెమీ-ఫైనల్ మ్యాచ్ శనివారం 11 సెప్టెంబర్‌లో జరిగింది. ఫైనల్‌లో బెర్త్ కోసం బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్ సివిల్ సర్వీస్ నార్త్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బైర్డీ క్లబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. జట్టు తరఫున డెల్జైల్ అత్యధికంగా 47 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న సివిల్ సర్వీసెస్ నార్త్ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక ఫన్నీ సంఘటన జరిగింది.
ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌లో సివిల్ సర్వీస్ బ్యాట్స్‌మన్ బంతిని స్క్వేర్‌గా కట్ చేశాడు బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్తోంది. ఫీల్డర్ బంతిని పట్టుకుని కీపర్ వైపు విసిరాడు. అతను రనౌట్ చేసే ప్రయత్నంలో బంతిని స్టంప్స్ వైపు కొట్టాడు. బంతి స్టంప్స్‌ని తాకలేదు కానీ ఈ సమయంలో ఒక చిన్న కుక్క మైదానంలోకి ప్రవేశించింది. బంతిని నోటిలో పట్టుకొని రేసును ప్రారంభించింది.గ్రౌండ్‌లోని ఫీల్డర్లు బంతిని తేవడానికి కుక్క వెంట పరుగెత్తుతారు. కానీ అది వారిని తప్పించుకుంటూ పరుగులు పెడుతుంది. కొంతసేపటి తర్వాత కుక్కను ఆపి బంతిని తీసుకొని వెళ్తారు. ఈ సమయంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి కుక్క పిల్లని తీసుకొని వెళుతాడు. మ్యాచ్ సమయంలో జరిగిన ఈ సంఘటన అందరినీ అలరించడం విశేషం.
? Great fielding…by a small furry pitch invader!@ClearSpeaks #AIT20 ? pic.twitter.com/Oe1cxUANE5
— Ireland Women’s Cricket (@IrishWomensCric) September 11, 2021