
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావాలను ఇప్పుడు యావత్ ప్రపంచం అనుభవిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నడుమ, అమెరికా కుతంత్రాలు, రెచ్చగొట్టే చర్యలు మధ్యప్రాచ్యాన్ని స్మశానంగా మారుస్తున్నాయి. ఇరాన్ జరిపిన ఒక డ్రోన్ దాడికి సంబంధించిన లైవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఖతార్‌లోని ఒక అమెరికా సైనిక స్థావరంలో చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయతుల్లా అలీరెజా అరాఫీ అనే ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఖతార్‌లోని ఒక అమెరికన్ స్థావరానికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సైనికులు స్థావరంలో ప్రశాంతంగా తిరుగుతూ కనిపించారు. కానీ ఇది రాబోయే పెను తుఫానుకు ముందున్న ప్రశాంతత అని ఎవరికీ తెలిసినట్లు లేదు. అకస్మాత్తుగా, ఒక డ్రోన్ వచ్చి సైనిక స్థావరంపై శక్తివంతమైన దాడి చేసింది. దీనివల్ల సంభవించిన విధ్వంసకరమైన పేలుడుతో మంటలు, దుమ్ము మేఘాలు నలువైపులా వ్యాపించాయి. అయితే ఈ లైవ్ వైరల్ వీడియోను టీవీ9 ధృవీకరించడం లేదు. ఈ కథనం కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో ఆధారంగా మాత్రమే రూపొందించినది.
ఈ డ్రోన్ దాడి తర్వాత జరిగిన మరో దాడి మొత్తం స్థావరాన్ని కుదిపేసింది. అయితే, ఈ వీడియోలో మృతుల సంఖ్య గానీ గాయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ వీడియోను పంచుకుంటూ, అయతుల్లా అలీరెజా అరాఫీ, “ఖతార్‌లోని యూఎస్ స్థావరంపై 100% విజయవంతమైన దాడి” అని రాశారు. ఇప్పుడు ప్రజలు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో కనిపించిన వెంటనే, అది వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు లక్షలాది మంది దీనిని చూశారు. చాలామంది లైక్ కూడా చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు, “ఇరాన్ ఆకలితో ఉన్న సింహంగా మారింది” అని రాశారు. “ఇరాన్ ఎవరినీ వదిలిపెట్టదు” అని మరొకరు రాశారు. ఇంకొకరు, “పోరాటం ఆపండి, 21వ శతాబ్దంలో ఇలా జరగకూడదు” అని రాశారు.
వీడియో ఇక్కడ చూడండిః
A 100% successful strike on the U.S. base in Qatar.@grok this is real? pic.twitter.com/oMzY3fp5Fb
— Ayatollah Alireza Arafi (@Realarafi) March 17, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..