Magic Blanket: ఆ దుప్పటి ఇవ్వగానే దివ్యాంగుడికి కాళ్లు.. చకచకగా నడుచుకుంటూ.. నెట్టింట్లో వీడియో వైరల్‌

|

Jan 08, 2022 | 3:53 PM

Magic Blanket:ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతుంది. ఈ క్రమంలో కొందరు ఉదారతతో అనాధలకు, దివ్యాంగులకు దప్పట్లు పంచుతూ..

Magic Blanket: ఆ దుప్పటి ఇవ్వగానే దివ్యాంగుడికి కాళ్లు.. చకచకగా నడుచుకుంటూ.. నెట్టింట్లో వీడియో వైరల్‌
Magic Blanket
Follow us on

Magic Blanket:ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతుంది. ఈ క్రమంలో కొందరు ఉదారతతో అనాధలకు, దివ్యాంగులకు దప్పట్లు పంచుతూ ఉంటారు. ఈ క్రమంలో డిజిటల్ లిటరసీ మిషన్ లో భాగంగా కొందరు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక అద్భుతం జరిగింది. వీల్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ దివ్యాంగుడికి ఇద్దరు వ్యక్తులు దుప్పటి ఇచ్చారు. దాన్ని తీసుకున్న ఆ యువకుడు… థాంక్స్ చెప్పాడు. వికలాంగుల కోసం చాలా గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకున్నాడు. అనంతరం వారికి నమస్కరించి దుప్పటి తీసుకుని ఆ వీల్‌ చైర్‌నుంచి లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ వీడియోని IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా… తన ట్విట్టర్ అకౌంట్ లో జనవరి 6న ఈ వీడియో పోస్ట్‌ చేశారు. “మాయా దుప్పటి… వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి దాన్ని పొందిన వెంటనే నడుస్తూ వెళ్లాడు” అని క్యాప్షన్ పెట్టారు. ఆ పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో వైరల్ అయిపోయింది… వేలమంది నెటిజన్లు లైక్స్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తూ దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కొందరు అల్లాద్దీన్‌ దుప్పటి అంటే మరికొందరు “ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఇలా అనర్హులకు ఇస్తూ మోసాలు చేస్తున్నారు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

నిజానికి ఆ వ్యక్తి దివ్యాంగుడే కానీ… పూర్తిగా వీల్‌ చైర్లో ఉండేంత దివ్యాంగుడు కాదు. అతనికి 40 శాతం లోకోమోటర్ డిజబులిటీ ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అతని దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఉంది. ఐతే… దుప్పటి ఇచ్చే సమయంలో… ఓ స్వచ్చంద సంస్థ సభ్యుడు వీల్ చైర్‌లో కూర్చోమని సూచించడం వల్ల తాను వీల్‌చైర్‌లో కూర్చున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. తనకు వీల్ చైర్ అవసరం లేదనీ… తాను నడవగలనని తెలిపాడు.

 

 

Also Read: ఆర్ధిక, మానసిక సమస్యల నివారణకు.. శనివారం శనీశ్వరుడికి ఈ నూనెతో పూజ చేయండి… అద్భుతం ఫలితం మీ సొంతం