పిల్లి అత్యుత్సాహం.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఇంతకు కథేంటంటే..!

ఇంట్లో ఉండి ఆ పిల్లికి బాగా బోర్ కొట్టిందో ఏమో..! ఏదైనా వినూత్నంగా చేయాలనుకుంది. ఏం చేయాలా..? ఏం చేయాలా..? అని తిరుగుతున్న ఆ పిల్లికి ఇంట్లో ఓ మూల స్విచ్ బోర్డ్ కనిపించింది. అంతే అందులో తలదూర్చేసింది. ఇంకేముంది దెబ్బకు కరెంట్ షాక్ కొట్టి ఎగిరి అంత దూరంలో పడింది. దీంతో జుట్టంతా చెదిరిపోయి.. చిన్నపాటి గుడ్లగూబలా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ పిల్లిని పెంచుకునే ఔరాకువా అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ […]

పిల్లి అత్యుత్సాహం.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఇంతకు కథేంటంటే..!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 2:57 PM

ఇంట్లో ఉండి ఆ పిల్లికి బాగా బోర్ కొట్టిందో ఏమో..! ఏదైనా వినూత్నంగా చేయాలనుకుంది. ఏం చేయాలా..? ఏం చేయాలా..? అని తిరుగుతున్న ఆ పిల్లికి ఇంట్లో ఓ మూల స్విచ్ బోర్డ్ కనిపించింది. అంతే అందులో తలదూర్చేసింది. ఇంకేముంది దెబ్బకు కరెంట్ షాక్ కొట్టి ఎగిరి అంత దూరంలో పడింది. దీంతో జుట్టంతా చెదిరిపోయి.. చిన్నపాటి గుడ్లగూబలా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ పిల్లిని పెంచుకునే ఔరాకువా అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘పిల్లికి ఉన్న అత్యుత్సాహం దాదాపుగా దాని చావుకు దారి తీసింది’ అంటూ కామెంట్ పెట్టింది. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఓర్నీ ఎంత పని చేశావు పిల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/owurakuwaa/status/1158643671916564480?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1158643671916564480&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftrending%2Fcat-exploring-a-switchboard-images-become-viral-in-social-media-nk-272804.html