Viral News:పెళ్లిలో ఫుడ్‌ వేస్ట్‌ చేసిన అతిథులు.. దిమ్మతిరిగే కామెంట్ చేసిన IAS ఆఫీసర్

|

Feb 19, 2022 | 6:00 PM

Viral News: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప.. అన్నారు పెద్దలు. ఇంటికి వచ్చిన అతిథులకే కాదు.. ఆకలి అని అడిగినవారికి లేదనకుండా.. తమకి..

Viral News:పెళ్లిలో ఫుడ్‌ వేస్ట్‌ చేసిన అతిథులు.. దిమ్మతిరిగే కామెంట్ చేసిన IAS ఆఫీసర్
Photo Of Food Wasted In Wed
Follow us on

Viral News: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప.. అన్నారు పెద్దలు. ఇంటికి వచ్చిన అతిథులకే కాదు.. ఆకలి అని అడిగినవారికి లేదనకుండా.. తమకి ఉన్నదానిలో ఎదుటివారికి పెట్టె సంస్కృతి మనది.. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు సామాన్యుడి పెళ్లి నుంచి సెలబ్రెటీ పెళ్లి వరకూ విందు భోజనం ఏర్పాటు ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. తమ ఇంట జరిగే పెళ్లిలో పెట్టిన భోజనం అందులోని వంటల రకాలు గురించి అందరూ చెప్పుకోవాలని ఎక్కువమంది భావిస్తూ.. రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

అవును ఇప్పటి పెళ్ళిళ్ళలోనే కాదు ఇతర ఫంక్షన్లలో కూడా విందు భోజనం భారీగానే ఉంటుంది. రకరకాల కూరలు, స్వీట్స్‌, ఇంకా ఇతర పదార్ధాలతో తినే ప్లేట్‌ నిండిపోతుంది. అయితే అందరూ అన్ని రకాల వంటకాలను తినలేరు. దీంతో తమ ప్లేట్ లో పెట్టుకున్న ఫుడ్‌ సగం పైగా డస్ట్‌బిన్‌లోకి చేరవేస్తున్నారు. ఇది ప్ర‌తి ఫంక్ష‌న్‌లో సర్వసాధారణంగా జ‌రిగేదే. ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పినా ఎవ్వ‌రూ విన‌రు. ప్లేట్ నిండా పెట్టుకుంటారు.. అందులో సగం కూడా తిన‌రు. దాంతో వండిన దాంట్లో స‌గం ఫుడ్‌ ఇలా వేస్టేజ్ కింద పోతుంది. అయితే ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ దీనిపై స్పందించారు.

ఐఏఎస్ ఆఫీస‌ర్ అవనీష్ శ‌ర‌ణ్ ఓ పెళ్లిలో వేస్ట్ అయిన ఫుడ్ ఫోటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. మీ పెళ్లిలో ఫోటోగ్రాఫ‌ర్ మిస్ చేసే ఫోటో ఇదే. ఆహారాన్ని వృథా చేయ‌డం ఆపండి.. అంటూ ఆయ‌న క్యాప్ష‌న్ పెట్టారు. ఆ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఆహారం వృథా గురించి స‌రైన అవ‌గాహ‌న లేదు. ప్ర‌తి రోజు 20 కోట్ల మంది భార‌తీయులు ఆహారం దొర‌క్క ఖాళీ క‌డుపుతో ఉంటున్నారు. అందుకే ఆహారాన్ని ఇక‌నైనా వృథా చేయ‌కండి.. అంటూ ఐఏఎస్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

Also Read:  మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఐదు విషయాలను ఎదుటివారితో పంచుకోవద్దు అంటున్న చాణక్య..