
అడవి ప్రపంచంలో, పరిస్థితులు ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు జంతువుల మధ్య ప్రేమ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ప్రతిచోటా మృత్యువు ఆట కనిపిస్తుంది. వేటగాళ్ళు తమ ఆహారం కోసం పరిగెడుతూనే ఉంటారు. అడవిలో చాలా జంతువులు ఉన్నప్పటికీ, వాటిలో అత్యంత ప్రమాదకరమైనవి సింహాలు, పులులు, హైనాలు. ముఖ్యంగా మనం హైనాల గురించి మాట్లాడుకుంటే, అవి సింహాలకు భయపడవు. ప్రస్తుతం, సింహం-హైనాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఒక సినిమా కథ కంటే తక్కువ కాదనిపించింది.
ఒక ఆడ సింహం ఒంటరిగా కనిపించగానే హైనాల గుంపు దానిని చుట్టుముట్టాయి. ఆ సింహం బలహీనంగా కనిపించడంతో, ఆ హైనాల గుంపు దాన్ని వేధించడంతో పాటు కొరికేయడానికి ప్రయత్నించాయి. కానీ అడవికి నిజమైన రాజు అయిన మగ సింహం అక్కడకు హీరో లెవల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఒంటరిగా మొత్తం గుంపును తరిమేసింది. వీడియోలో, ఆడ సింహం ఒంటరిగా కనిపించిన వెంటనే హైనాలు దానిపై ఎలా దాడి చేశాయి చూడవచ్చు. కొన్ని సెకన్ల పాటు సింహన్ని వేధించాయి. కానీ మగ సింహం సినిమా స్టైల్‌లో ప్రవేశించిన వెంటనే, అన్ని హైనాలు పారిపోయాయి. ఇంతలో, మగ సింహం ఒక హైనాను పట్టుకుని దాని మెడను బిగించేసింది. అతి కష్టం మీద, ఇతర హైనాలు దాని ప్రాణాలను కాపాడాయి.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @gunsnrosesgirl3 అనే ఖాతాలో షేర్ చేశారు. ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వీక్షించారు, 4 వేలకు పైగా ప్రజలు దీన్ని లైక్ చేసి వివిధ రకాల స్పందనలు ఇచ్చారు.
వైరల్ వీడియో చూడండి:
Her partner answered her call
📹story composed from two different vids
— Science girl (@gunsnrosesgirl3) September 11, 2025
వీడియో చూసిన తర్వాత, ఒక యూజర్ ‘ఈ దృశ్యం ఏ వన్యప్రాణుల డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా ఉంది’ అని రాశారు. మరొకరు ‘ఆ సింహం ఒంటరిగా ఉండవచ్చు, కానీ రాజు దాంతో చేరిన వెంటనే అడవి నియమాలు మారిపోయాయి’ అని రాశారు, మరొక యూజర్ ‘ఇది నిజ జీవిత హీరో ఎంట్రీ’ అని రాశారు. మరొకరు ‘రాజు తన రాణిని కాపాడటానికి పూర్తిగా సినిమా శైలిలో వచ్చాడు’ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..