Wife and Husband: ఫస్ట్ నైట్ రోజు భార్య చెప్పిన మాటకు భర్త షాక్.. మరుసటి రోజు నేరుగా వెళ్లి..

Wife and Husband: పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో సాధారణంగానే వధు వరులకు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉండదు. ఆ క్రమంలోనే చాలా మంది..

Wife and Husband: ఫస్ట్ నైట్ రోజు భార్య చెప్పిన మాటకు భర్త షాక్.. మరుసటి రోజు నేరుగా వెళ్లి..
Wedding

Updated on: Apr 11, 2022 | 6:59 AM

Wife and Husband: పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో సాధారణంగానే వధు వరులకు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉండదు. ఆ క్రమంలోనే చాలా మంది తమ తమ గురించి తెలుసుకునేందుకు ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. మరికొందరు.. మొదటి రాత్రి ప్రశాంతంగా ముచ్చటిస్తుంటారు. తమకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించుకుంటారు. ఏదీ దాపరికం లేకుండా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలోనూ అదే జరిగింది. అయితే, అదికాస్తా విడాకులకు దారి తీసింది. అవును.. ఫస్ట్ నైట్ రోజు భార్య తన భర్తకు చెప్పిన మాట చివరకు విడాకులకు దారి తీసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడికి 2019లో వివాహం జరిగింది. కొత్తగా పెళ్లైన ఈ జంట ఫస్ట్ నైట్ రోజున.. వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, తదితర అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే వధువు తనకు సంబంధించి ఓ చేదు విషయాన్ని భర్తకు చెప్పింది. అది విని అతను షాక్ అయ్యాడు. గతంలో తనపై తన మేనమామ కుమారుడు అత్యాచారం చేసినట్లు చెప్పడంతో అతను నిర్ఘాంతపోయాడు. కాసేపటి తరువాత తేరుకుని ఈ పెళ్లి అవసరం లేదంటూ ఫైర్ అయ్యాడు. తన భార్యను మరుసటిరోజు ఉదయం ఆమె పుట్టింట్లో విడిచిపెట్టాడు. తన తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన ధర్మాసనం.. పెళ్లి రద్దుకు సంబంధించి అతని భార్యకు అనేకమార్లు నోటీసులు పంపించింది. దాదాపు మూడేళ్లుగా ఆమె నుంచి ఎలాంటి రెస్పాండ్స్ రాకపోవడంతో తాజాగా కోర్టు వారి పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..