Viral: పురావస్తు అధికారులు సర్వే చేస్తుండగా.. కనిపించిన కాలి ముద్రలు.. పరిశోధన చేయగా షాక్!

|

Jul 30, 2022 | 1:33 PM

ఓ ఎడారిలో పురావస్తు శాఖ అధికారులు రాడార్ సర్వే నిర్వహిస్తుండగా.. వారికి కొన్ని కాలి ముద్రలు కనిపించాయి. ఇక వాటిని..

Viral: పురావస్తు అధికారులు సర్వే చేస్తుండగా.. కనిపించిన కాలి ముద్రలు.. పరిశోధన చేయగా షాక్!
Foot Prints
Follow us on

ఓ ఎడారిలో పురావస్తు శాఖ అధికారులు రాడార్ సర్వే నిర్వహిస్తుండగా.. వారికి కొన్ని కాలి ముద్రలు కనిపించాయి. ఇక వాటిని పరిశోధించి చూడగా.. అవి సుమారు 12 వేల ఏళ్ల క్రితం నాటివి అని.. ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్ కాలం నాటివిగా గుర్తించారు. మరి ఇంతకీ అసలు ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. కొందరు పురావస్తు శాఖ అధికారులు యూటా(Utah)లోని గ్రేట్ సాల్ట్ లేక్ ఎడారిలో ఇటీవల రాడార్ సర్వే నిర్వహించారు. వారికి ఆ సమయంలో సుమారు 88 మానవ పాదముద్రలు కనిపించాయి. వాటిని పరిశోధన చేయగా.. 12 వేల ఏళ్ల క్రితం అంటే.. ఐస్ ఏజ్ కాలం చివరినాటికి సంబంధించినవిగా గుర్తించారు. సరైన మొత్తంలో తేమ ఉన్నప్పుడే ఇసుకపై కాలిముద్రలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రాడార్ సర్వే ద్వారా వాటిపై అధ్యయనం చేస్తున్నారు. మొదటిగా అక్కడున్న భూమి ఉపరితలాన్ని పరిశోధించి.. ఆ తర్వాత అక్కడి నీటి తేమ ద్వారా అవి మంచు కాలం నాటి వాళ్ల కాలి ముద్రలుగా పరిశోధకులు భావిస్తున్నారు. అవి సుమారు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు వయసున్న వారికి పాదముద్రలుగా నిపుణులు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే.. అక్కడుందే మట్టి ఆ పాద ముద్రలను వేల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంచిందని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యూటా ఎడారిలో పరిశోధకులు కేవలం పాదముద్రలు మాత్రమే కాదు.. వాటిని కనుగొన్న ప్రాంతం నుంచి అరమైలు దూరంలో మానవ పొగాకు వినియోగానికి సంబంధించిన పురాతన సాక్ష్యాన్ని కూడా కనిపెట్టారు.(Source)