Viral Video: కడుపు ఉబ్బిపోయి కదల్లేకుండా కనిపించిన కొండచిలువ.. అనుమానమొచ్చి ఎక్స్‌రే తీయగా

కడుపు ఉబ్బిపోయి కనిపించిన ఓ భారీ కొండచిలువ. ఆ కొండచిలువను చూసిన పర్యాటకులు అనుమానమొచ్చి దాని ఎక్స్ రే తీయించారు. ఇక ఆ తర్వాత అసలు విషయం బయట పడింది. దాని కడుపులో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Viral Video: కడుపు ఉబ్బిపోయి కదల్లేకుండా కనిపించిన కొండచిలువ.. అనుమానమొచ్చి ఎక్స్‌రే తీయగా
Representative Image

Updated on: Sep 09, 2025 | 5:03 PM

సరీసృపాలలో కొండచిలువలు పరిమాణంలోనే కాదు.. పొడవులోనూ భారీగానే ఉంటాయి. తమకు ఆకలి వేస్తే ఎంతటి జంతువునైనా మట్టుపెట్టేస్తాయి. ఒక్క జంతువులే ఏంటి.? మనుషులను సైతం అమాంతం మింగేస్తాయి. మరి అలాంటి కొండచిలువలను దగ్గర నుంచి చూస్తేనే.. ఇంకేమైనా ఉంటుందా.? దెబ్బకు దడుసుకుని చస్తాం. ఇక తాజాగా ఓ కొండచిలువ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ భారీ కొండచిలువ తన వేటను మింగేసి ఎంచక్కా కదల్లేని స్థితిలో పాకుతూ కనిపించింది. మరి అదేంటో చూసేద్దాం..

 

వైరల్ వీడియో ప్రకారం.. కొంతమంది టూరిస్టులు వెస్ట్రన్ సేరెంగేటి నేషనల్ పార్క్‌లో సందర్శిస్తుండగా.. అందులో ఉన్న ఓ టూర్ గైడ్‌కి ఉబ్బిపోయిన పొట్టతో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అనుమానమొచ్చి దగ్గరకు వెళ్లి చూడగా.. దాన్ని పట్టుకుని ఎక్స్‌రే తీశారు. ఇక ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఎంచక్కా తన మీల్స్ ఆరగించి.. నెమ్మదిగా నేలపై పాకుతూ కనిపించింది. సజీవంగా ఉన్న ఇంపాలాను మింగేసిన ఈ పైథాన్.. ఆపై వారం లేదా నెలల రోజులకు భోజనం చేయదట. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సారి లుక్కేయండి.