సోషల్ మీడియాలో ఏది.? ఎప్పుడు.? ఎందుకు వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయని అనుకుంటాం. కానీ కావు. అయితే మరికొన్ని ఫోటోలు ఎందుకు వైరల్ అవుతాయో అస్సలు చెప్పలేం. ఇదిలా ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో తరచూ మెదడుకు మేత వేసే లాంటి ఫోటో పజిల్స్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. మన మెదడుకు కొంచెం పదును పెడితే చాలు.. తగ్గేదేలే అన్నట్లుగా వాటిని చిటికెలో సాల్వ్ చేసేయగలం. తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం మరి. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడుందో మీరు చెప్పాలి. చూడటానికి చెట్టు బెరడులా ఉన్న ఆ చోట ఓ పిల్లి దాగుంది. పిల్లి ఏం లేదు అక్కడ.. అది కేవలం చెట్టు బెరడు అని అంటే.. మీలో దృష్టి లోపం ఉన్నట్లే. ఏదో ఊరికే అలా ఆ ఫోటోను చూస్తే మీరు పిల్లిని కనిపెట్టలేరు. కాస్త దృష్టి పెట్టాలి. మెదడుకు పదును పెట్టాలి. నూటికి 95 శాతం మంది మొదటిసారే ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేసేశారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
Here is the answer pic.twitter.com/ANtYzWjmcO
— telugufunworld (@telugufunworld) January 18, 2022