Video Viral: ఎక్కి కూర్చుందామనుకుంటే కిందపడేసి కుమ్మేసింది.. వీడియో చూస్తే షాక్ అవడం పక్కా

|

Jul 30, 2022 | 3:00 PM

సోషల్ మీడియాలో (Social Media) జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుంతుంటాయి. కొన్నిసార్లు ఇవి నవ్విస్తే మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి, మరికొన్ని భయానికి గురి చేస్తాయి. కుక్కలు, పిల్లులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో...

Video Viral: ఎక్కి కూర్చుందామనుకుంటే కిందపడేసి కుమ్మేసింది.. వీడియో చూస్తే షాక్ అవడం పక్కా
Horse Video Viral
Follow us on

సోషల్ మీడియాలో (Social Media) జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి నవ్విస్తే మరికొన్ని సార్లు ఆశ్చర్యానికి, మరికొన్ని భయానికి గురి చేస్తాయి. కుక్కలు, పిల్లులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో కనిపిస్తున్నప్పటికీ గుర్రాలకు (Horse) సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి గుర్రం మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. దీనిని గుర్రం ఇష్టపడదు. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా గుర్రం అతనిని కింద పడేయడానికి ట్రై చేస్తుంది. ఒకానొక సమయంలో అమాంతం కింద పడేస్తుంది. ఈ వీడియోలో రెండు గుర్రాలను స్తంభానికి కట్టేశారు. ఈ వ్యక్తి తనపై కూర్చోవడానికి గుర్రం ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది. అందుకే ఆ వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ అయింది. కేవలం 7 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 83 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ప్రజలు కూడా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అవసరం లేని వస్తువులను బయటికు విసిరేస్తారు. అలాగే ఈ గుర్రం కూడా అతనిని కింద పడేసిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి