
సొంత ఇల్లు ఉండాలి.. అనేది ప్రతి ఒక్కరి జీవిత ఆశయం. దీనికోసం ఎంతటి కష్టనైనా భరిస్తూ రూపాయి రూపాయి కూడబెడుతుంటారు చాలా మంది. అందరూ కొత్త ఇంటిని సొంతంగా కట్టుకోలేరు. అలాగని కొత్త ఇళ్లు కొనాలన్నా సరిపడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే, కొందరు కొత్త ఇల్లు కొనుక్కోలేనప్పుడు పాత ఇంటిని కూడా కొత్తగా కనిపించేలా తరచూ మరమ్మతులు చేస్తుంటారు. ఒక బ్రిటిష్ జంట కూడా అలాగే చేశారు. వారు ఒక పాత ఇంటిని కొని దానిని (Old House Renovation) పునరుద్ధరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారు ఇంతకాలం వెలుగులోకి రాని ఓ రహస్య ప్రదేశాన్ని వారు ఆ ఇంట్లో గుర్తించారు..అక్కడి గోడలపై కనిపించిన దృశ్యాలను వారు షాక్ తిన్నారు.
నివేదిక ప్రకారం.. లంకాషైర్‌కు చెందిన హన్నా, సామ్ దంపతులు ఒక పాత ఇంటిని కొనుగోలు చేశారు. దానికి వారు మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు ఇంట్లో ఒక చోట భూగర్భంలోకి వెళ్లేలా మెట్లను గమనించారు. వెంటనే వారు ఆ మార్గం గుండా నేరుగా కిందికి వెళ్లారు. అక్కడ, గోడపై కొన్ని రాతలను వారు గమనించారు. అదంతా చూసివారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాస్తవానికి వారు మునుపటి యజమాని వస్తువులను తొలగిస్తున్నప్పుడు గోడపై ఉన్న రాతను చూశారు. నిజానికి కింద ఒక సెల్లార్ ఉంది. పురాతన కాలంలో ఇలాంటి సెల్లార్ అంటే ప్రజలు వైన్ నిల్వ చేసే గది.
@restoring_oakfield అనే ఇన్‌స్టా ఖాతా ద్వారా ఆ ఇంటిలో కిందకు దారితీసే మెట్లను పోస్ట్ చేశాడు. మొదట అది ఒక సాధారణ సెల్లార్ లాగా కనిపిస్తుంది. ఇది చాలా చోట్ల విరిగిపోయి ఉంది. కానీ, అక్కడి గోడపై ఓ షాకింగ్ కామెంట్ రాసి ఉంది.. అదేంటంటే.. మరణం మిమ్మల్ని అనుసరిస్తోంది. అంతేకాదు.. పైకప్పుపై కూడా ఇలా రాసి ఉంది..దయచేసి మీ తలని జాగ్రత్తగా చూసుకోండి అని కనిపించింది. ఈ విషయాలన్నీ గోడలపై బొమ్మలు, గ్రాఫిటీలా రాయబడి ఉన్నాయి. మునుపటి యజమాని పిల్లలు సెల్లార్‌లో తమకు ఇష్టమైన బ్యాండ్‌ల పేర్లు, పాటల సాహిత్యాన్ని రాసినట్టుగా ఆ జంట వీడియోలో చెప్పారు. అంతేకాదు.. గోడపై ఉన్న రాతలను చెరిపివేయనివ్వబోమని, దానిని ఎల్లప్పుడూ ఒక చారిత్రక స్మారక చిహ్నంగా ఉంచుతామని ఆ జంట చెప్పారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 35,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇది ఎవరు రాశారో మీకు తెలిస్తే మంచిదే, లేకుంటే అది చాలా భయానక అనుభవంగా ఉండేది అని ఒకరు అన్నారు. సెల్లార్‌లోని రాతి బల్ల అద్భుతంగా ఉందని మరొకరు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..