Viral Video: బాప్ రే.. టెన్నీస్ బాల్ సైజ్‌లో వడగళ్లు.. ఇంత భీకర వర్షం ఎప్పుడూ లేదు..! షాకింగ్ వీడియో

|

Apr 16, 2022 | 7:58 AM

Hailstorm Shocking Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు.

Viral Video: బాప్ రే.. టెన్నీస్ బాల్ సైజ్‌లో వడగళ్లు.. ఇంత భీకర వర్షం ఎప్పుడూ లేదు..! షాకింగ్ వీడియో
Strom
Follow us on

Hailstorm Shocking Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తుంటారు. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో వడగళ్ల వానకు సంబంధించినది. వాన కురిసేటప్పుడు వడగళ్లు పడటం సాధరణమే కానీ.. ఇక్కడ విషయం మరోలా ఉందంటూ వీడియో చూసి నెటిజన్లు అందరూ నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా వడగళ్ల వానను చాలాసార్లు చూసి ఉంటారు. అయితే.. ఈ వడగండ్ల పరిమాణం చిన్న చిన్న రాళ్ల నుంచి.. బంగాళాదుంప పరిమాణం వరకు ఉంటుంది. అయితే.. టెన్నిస్ బాల్ పరిమాణంలో వడగండ్లు పడటం మీరు ఎప్పుడైనా చూశారా? దాదాపు ఎవరూ కూడా చూసుండరు. చాలా అరుదుగా జరిగే.. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో (Social Media) ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో వడగండ్లు టెన్నిస్ బాల్ సైజులో పడుతున్నాయి. ఈ సంఘటన అమెరికా (America) లోని సౌత్ కరోలినాలోని ఆయనూర్‌లో జరిగినట్లు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం.. వడగళ్ల వానకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ వైరల్‌గా మారింది. దీనిని వైరల్ హాగ్ అనే ఛానెల్.. యూట్యూబ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ఇలాంటి వడగళ్ల వాన నేను చూడలేదంటూ యూజర్ క్యాప్షన్‌ కూడా రాశారు. ఈ వడగళ్లలో కొన్ని బేస్ బాల్ అంత పెద్దవిగా కూడా ఉన్నాయి. ఈ వడగళ్ల వాన వల్ల ఇళ్ల నుంచి పంటల వరకు అన్ని దెబ్బతిన్నాయని మీడియా వెల్లడించింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతపెద్ద వడగండ్లను ఇంతవరకు చూడలేదంటూ పేర్కొంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి.

వైరల్ వీడియో..

 

Also Read:

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Viral Video: తగ్గేదే లే.. పెళ్లి వేదికపై ‘పుషప్స్‌’తో అదరగొట్టిన వధువు.. కండలు చూపెడుతూ..!