Viral: అమ్మబాబోయ్.! అక్కడికి వెళ్తే మాడి మసైపోతారు.. 14 ఏళ్లలో తొలిసారి..

అక్కడికి వెళ్తున్నారా.? మీరు ఇక మాడి మసైపోయినట్టే.. వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈసారి పర్యాటకం అక్కడికి వెళ్ళవద్దు అని చెబుతున్నారు. మరి ఆ దేశం ఏంటి.? అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీలోకి ఇక వెళ్లిపొండి మరి.

Viral: అమ్మబాబోయ్.! అక్కడికి వెళ్తే మాడి మసైపోతారు.. 14 ఏళ్లలో తొలిసారి..
Telugu News

Updated on: Jun 30, 2025 | 12:52 PM

భారత్‌లో ఎండలు పోయి.. వర్షాలు వచ్చేస్తే.. పలు దేశాల్లో మాత్రం భానుడు భగభగలకు విలవిలలాడుతున్నారు జనాలు. అత్యంత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో.. పొగలు కక్కుతున్నాడు. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో దేశంలో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. మొరాకో అంతటా ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్ దాటాయని అక్కడి స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఆఫ్రికా వేడిగాలులతో అతలాకుతలమవుతోందని తెలిపింది.

దక్షిణ ఐరోపాలోని జిబ్రాల్టర్ జలసంధిని కూడా వేడిగాలులు తాకడంతో.. మొరాకోలోని అనేక ప్రాంతాల్లో సూర్యుడు భగభగలు చూపిస్తున్నాడు. మొరాకోలోని తీరప్రాంత నగరమైన కాసాబ్లాంకాలో 39.5C (103 ఫారెన్‌హీట్)కి చేరగా.. ఇది జూన్ 2011లో నమోదైన 38.6C రికార్డును అధిగమించింది. తీరానికి 250 కిలోమీటర్లు (150 మైళ్ళు) దూరంలో ఉన్న లారాచేలో, 43.8C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2017 జూన్‌లో నమోదైన మునుపటి గరిష్ట ఉష్ణోగ్రత కంటే 0.9C ఎక్కువ అని మాట.

అలాగే సెంట్రల్ మొరాకోలోని బెన్ గెరిర్‌లో ఉష్ణోగ్రతలు 46.4Cకి చేరింది. రెండేళ్ల నాటి రికార్డును 1.1C అధిగమించాయి. మొత్తం మీద 17కి పైగా ప్రాంతాలు 40C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. అట్లాంటిక్ ప్రాంతాలపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ అధికారులు. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా పర్యటించే ఈ మొరాకో దేశంలో.. ఈసారి వేసవికి వెళ్లకుంటే మంచిదని అంటున్నారు. అక్కడికి వెళ్తే మాడి మసైపోతారని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..