Video: మనసు దోచే వీడియో..! ఇది కదా నిజమైనా బంధం అంటే..

రైలులో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త ప్రేమగా తన భార్యకు కొత్త పట్టీలు కడుతున్న దృశ్యం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించింది. ఈ వీడియోను జిష్మా ఉన్నికృష్ణన్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Video: మనసు దోచే వీడియో..! ఇది కదా నిజమైనా బంధం అంటే..
Viral Video

Updated on: Sep 04, 2025 | 9:39 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందలాది వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, వాటిలో కొన్ని హృదయాన్ని నేరుగా తాకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక వృద్ధ జంట వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది, నెటిజన్లు ఈ వీడియోకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ వైరల్ క్లిప్‌ను నెటిజన్లు నిజమైన ప్రేమకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..?

కోయంబత్తూరు నుండి ప్రయాణిస్తున్న జిష్మా ఉన్నికృష్ణన్ అనే మహిళ ఈ అందమైన క్షణం వీడియోను రికార్డ్ చేసింది, దీనిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @jishma_unnikrishnan లో షేర్ చేసింది, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో పక్క సీట్లలో కూర్చున్న ఒక వృద్ధ జంటను చూడవచ్చు. భర్త ప్రేమగా తన భార్య కాళ్లకు కొత్త పట్టీలను స్వయంగా ఆయనే తొడిగాడు. ఈ సమయంలో ఆ మహిళ ముఖంలో ఆనందంతో నిండిపోయింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉన్నికృష్ణన్ ఇలా రాశారు, నేను కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాను, కానీ ఒక సాధారణ క్షణంలో నేను జీవితకాల ప్రేమకు సాక్షిని అయ్యాను. కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీక్షించారు. 1 లక్ష 17 వేలకు పైగా ప్రజలు దీన్ని లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి