
హర్యానాలో భారీ వర్షాల కారణంగా మారుతి సుజుకి గిడ్డంగిలో దాదాపు 300 కార్లు నీటిలో మునిగిపోయాయి. కార్లు నీటిలో మునిగిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీని కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విషయంలో హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బహదూర్‌గఢ్ ప్రాంతంలో మారుతి సుజుకి కార్ల గిడ్డంగి ఉంది.
ఆ కంపెనీ అక్కడ 300 కార్లను పార్క్ చేసింది. ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, అన్ని కార్లు నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో మారుతి సుజుకి గిడ్డంగిలో వందలాది కార్లు పార్క్ చేసి ఉన్నాయి. కార్లు సగం నీటిలో మునిగిపోయాయి.
కొన్ని కార్లు నీటిలో తేలుతున్నాయి. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. సాధారణంగా కార్లు వర్షపు నీటిలో పడినప్పుడు, నీరు ఇంజిన్, ఇతర భాగాలలోకి ప్రవేశించి సమస్యలు తలెత్తుతాయి. 300 కార్లు నీటిలో మునిగిపోవడంతో మారుతి సుజుకికి భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 50 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. వర్షపు నీటిలో చిక్కుకున్న కార్లను రక్షించడానికి కంపెనీ తన ప్రయత్నాలు చేస్తోంది.
#WATCH | Haryana: Several cars partially inundated due to severe waterlogging at a stockyard in Bahadurgarh. pic.twitter.com/9p5C68Kg1L
— ANI (@ANI) September 7, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి