గాయపడిన యజమాని నడకను అనుకరిస్తున్న కుక్క.. హృదయాలను కదిలించే వీడియో వైరల్‌

|

Oct 04, 2022 | 5:17 PM

ఈ రోజుల్లో ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. పాములు, పులులు, సింహాలు, మొసళ్లు వంటి..

గాయపడిన యజమాని నడకను అనుకరిస్తున్న కుక్క.. హృదయాలను కదిలించే వీడియో వైరల్‌
Dog Video
Follow us on

ఈ రోజుల్లో ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. పాములు, పులులు, సింహాలు, మొసళ్లు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతి రోజు తెగ వైరల్‌ అవుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోలు కొన్ని షాకింగ్‌కు గురి చేసేలా ఉంటే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాగే మరి కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. ఇక కుక్కులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతుంటాయి. కుక్క అనేది విశ్వాసం గల జంతువుగా పేరుంది. చాలా మంది ఇంటి వద్ద కుక్కలను పెంచుకుంటారు. వాటికి మనుషుల కంటే ఎక్కువగా ప్రేమించే వారుంటారు. శునకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుక్కలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా పసిగట్టే గుణం కుక్కలకు ఉంటుంది. ఇక తాజాగా ఓ పెంపుడు కుక్క వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోలో కనిపించే కుక్క తన యజమానికి గాయమైంది. అతను కాస్త గెంతుకుంటూ నడుస్తుంటాడు. గాయపడిన ఆ యజమాని కుక్క కుడా అతని నడకను అనుసరించడం అందరు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. గాయపడిన ఆ యజమాని నడక శైలిని అనుకరించడానికి ప్రయత్నిస్తోంది.

 

అయితే యజమానికి కుడికాలికి దెబ్బ తగలడంతో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. కుక్క తనతో పాటు అదే వేగంతో నడవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్లిప్‌ను RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా షేర్ చేశారు. ‘కుక్కలు ఎప్పుడూ తమ యజమానిని అనుసరిస్తాయి’ అని అతను క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ కుక్కను ప్రశంసిస్తున్నారు. యజమాని కాలుకు గాయమై, కుక్క కాలు బాగానే ఉన్నా.. తన యజమానిని అనుకరిస్తూ నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి