Video: జిమ్‌లో మహిళల డిష్యూం డిష్యూం..! ఎందుకో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

ప్రస్తుతం జిమ్‌లు రద్దీగా మారడంతో మెషీన్ల కోసం గొడవలు సర్వసాధారణమవుతున్నాయి. ఇటీవల, ఇద్దరు మహిళలు జిమ్ మెషిన్ కోసం తీవ్రంగా కొట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పీక్ అవర్స్‌లో వేచి ఉండలేక, చికాకుతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Video: జిమ్‌లో మహిళల డిష్యూం డిష్యూం..! ఎందుకో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
Gym Fight

Updated on: Sep 29, 2025 | 10:14 PM

ప్రస్తుతం కాలంలో చాలా మంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే జిమ్‌లు చాలా రద్దీగా ఉంటున్నాయి. జిమ్‌కు వెళ్లే చాలా మందికి పీక్ అవర్స్ సమయంలో ప్రతి మెషిన్ చుట్టూ క్యూలో ఉంటున్నారు. కొందరు ఒక సెట్‌ను పూర్తి చేయడానికి సమయం తీసుకుంటారు, మరికొందరు తమ వంతు కోసం వేచి ఉంటారు. ఈ సమయంలో చికాకు లేదా తేలికపాటి వాదనలు సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు జిమ్‌ చేసేందుకు గొడవలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళలు జిమ్ మెషిన్ కోసం గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓ మహిళ వెళ్లి ఓ మెషీన్‌పై వర్క్‌ అవుట్‌ చేస్తోంది. కానీ, అప్పటికే తమ వంతు కోసం వేచి ఉన్న మహిళ ఆమెతో గొడవకు దిగింది. దీంతో మాటామాట పెరిగి ఇద్దరు కొట్టుకున్నారు. వారు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ తీవ్రంగా గొడవపడ్డారు. కొద్ది సేపు జిమ్‌ కాస్త రెజ్లింగ్ అరేనాగా మారిపోయింది. ఆ ఇద్దరు మహిళలు దాదాపు రెండు నిమిషాల పాటు తీవ్ర ఘర్షణకు దిగారు. చివరికి జిమ్‌లోని ఇతర అమ్మాయిలు రంగంలోకి దిగి చాలా కష్టంతో వారిని విడదీశారు. అయితే ఇప్పటికే వీరి గొడవంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయిపోయింది. ఎవరో దాన్ని క్లిప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి