Guinness World Records: ప్రపంచంలోనే అతి పొడవైన పిల్లి.. దీని పొడవు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి

Guinness World Records: ప్రపంచంలోనే అతి పొడవైన పిల్లి.. దీని పొడవు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Guinness World Record

Updated on: Oct 04, 2022 | 8:45 AM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్‌ విలియం జాన్‌ పవర్స్‌ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్‌ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంది.

2016లో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదంలో మరణించాయట. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయి. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుందట. కనుకే అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. పొడవైన పిల్లికి సంబంధించిన ఫోటోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. పొడవైన పిల్లితో దాని యజమాని సరదాగా నిల్చున్న వీడియోను ఈ పోస్ట్‌లో చూడొచ్చు. చూడటానికి దేశీ ఆకారంలో ఉన్న ఈ పిల్లి చాలా పెద్దదిగా, పొడవుగా ఉంది. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us