గాలికి ఎగిరిపోయిన మనిషి.. వైరల్ వీడియో

టర్కీ : అప్పుడప్పుడు వీచే భారీ గాలులకు భారీ వృక్షాలే నేలకొరుగుతాయి. పెద్ద పెద్ద వాహనాలు కూడా అడ్డం పడుతాయి. కొన్ని సందర్భాల్లో భారీ వస్తువులు కూడా గాల్లో కొట్టుకుపోతాయి. అయితే టర్కీలో మాత్రం భారీగా వీచిన గాలికి ఓ మనిషి పైకి ఎగిరాడు. అదేంటి మనిషి గాలికి ఎగరడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ఏం లేదండి.. టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్ సమీపంలోని మార్కెట్లో భారీ గాలులు వీచాయి. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ షాపు ఎదురుగా […]

గాలికి ఎగిరిపోయిన మనిషి.. వైరల్ వీడియో
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 8:27 PM

టర్కీ : అప్పుడప్పుడు వీచే భారీ గాలులకు భారీ వృక్షాలే నేలకొరుగుతాయి. పెద్ద పెద్ద వాహనాలు కూడా అడ్డం పడుతాయి. కొన్ని సందర్భాల్లో భారీ వస్తువులు కూడా గాల్లో కొట్టుకుపోతాయి. అయితే టర్కీలో మాత్రం భారీగా వీచిన గాలికి ఓ మనిషి పైకి ఎగిరాడు. అదేంటి మనిషి గాలికి ఎగరడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ఏం లేదండి.. టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్ సమీపంలోని మార్కెట్లో భారీ గాలులు వీచాయి. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ షాపు ఎదురుగా ఏర్పాటు చేసిన అడ్వర్టయిజ్ మెంట్ కి సంబంధించిన ఓ గోడుగు గాలికి కొట్టుకుపోబోయింది. అయితే ఆ గొడుగు ఎగరడాన్ని గమనించిన ఓ వ్యక్తి దానిని పట్టుకొబోయాడు. అంతే ఆ భారీ గాలికి గొడుగుతో పాటుగా అతను కూడా పైకి ఎగిరాడు. దాదాపు 4 నుంచి 5 మీటర్లు ఎత్తు ఎగిరిన అనంతరం.. గాలి ప్రభావం తగ్గి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని అందుకోబోయారు. అయినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అయితే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపడటంతో. .దానిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే క్షణాల్లో లక్షల మంది వీక్షించారు.