అయ్యో అక్కా ఎంతపనైంది.. రీల్స్‌ కోసం సొమ్ములు చూపించుకుంటే.. ఉన్నదంతా ఊడ్చేశారుగా..!

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చేసే కొన్ని పనులు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అయిన రచన గుర్జర్ రీల్స్ చేస్తూ తన వద్ద ఉన్న బంగారు నగలను నెటిజన్లకు ప్రదర్శించింది. ఇది గమనించిన దొంగలు పక్కా ప్లాన్‌తో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చేతివాటం చూపించారు.. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయ్యో అక్కా ఎంతపనైంది.. రీల్స్‌ కోసం సొమ్ములు చూపించుకుంటే.. ఉన్నదంతా ఊడ్చేశారుగా..!
Influencer Robbery

Updated on: Jun 08, 2026 | 1:20 PM

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చేసే కొన్ని పనులు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అయిన రచన గుర్జర్ రీల్స్ చేస్తూ తన వద్ద ఉన్న బంగారు నగలను నెటిజన్లకు ప్రదర్శించింది. ఇది గమనించిన దొంగలు పక్కా ప్లాన్‌తో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చేతివాటం చూపించారు.. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నవాబ్ సాహబ్ రోడ్డులో నివసించే రచన గుర్జర్ ఒక ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తరచూ తన రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోలు, రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే, కొద్దిరోజుల క్రితం ఆమె తన వద్ద ఉన్న ఖరీదైన బంగారు నగలను ధరించి, వాటిని చూపిస్తూ కొన్ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆమె చేసిన వీడియోలను నిశితంగా గమనించిన కొందరు దుండగులు, ఆమె ఇంట్లో భారీగా బంగారం ఉందని గ్రహించి దొంగతనానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో, రచన గుర్జర్ కుటుంబ సభ్యులతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన దొంగలు, అర్ధరాత్రి వేళ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అల్మారాలో దాచి ఉంచిన సుమారు రూ. 8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించుకొని పరారయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

పెళ్లి ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు, తాళాలు పగిలి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా నగలు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా వినియోగదారులందరికీ ఒక పెద్ద పాఠం. ఇంటర్నెట్‌లో లైక్స్ కోసం మన ఇల్లు, నగలు, కొత్తగా కొన్న ఖరీదైన వస్తువులు లేదా మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నామనే విషయాలను షేర్ చేయడం వల్ల నేరగాళ్లకు మనమే స్వయంగా అవకాశం ఇచ్చినట్లవుతుందని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us