
Viral Video: పాములు చాలా విషపూరితమైనవి.. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని పాములకు విషం తక్కువ ఉంటుంది. మరి కొన్ని పాములకు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటి పాములను చూస్తే పరుగులు పెట్టకుండా ఉంటామా.. వెనక్కి తిరిగి కూడా చూడం.. అలాంటి పాములను పట్టుకోవడం అంటే సాహసమనే చెప్పలి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి పామును పట్టుకొని ఓ వీడియో చేసింది కానీ చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఆ పాము.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఇండియన్ కోబ్రాను పట్టుకొని వీడియో తీసుకుంది. అయితే ఆ ప్రమాదకరమైన పామును చూపిస్తూ.. అది పడగ విప్పితే దాని గురించి వివరించాలని ప్రయత్నించింది. అయితే ఆ పాము మాత్రం ఆమె ఎంతగా విసిగించిన పడగ విప్పకుండా ఉండిపోయింది. కానీ ఆమె వీడియో కోసం ఆ పామును అటు ఇటు చూపిస్తూ ఉంది. చివరకు పాముకు చిర్రెత్తుకు రావడంతో ఆమె పైకి ఒక్కసారిగా దాడి కి దిగింది. దాంతో భయపడిన ఆ యువతి పామును కింద పడేసింది. పాము ఒక్కసారిగా ఊహించని పని చేయడంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి