సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పిస్తాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. లైక్స్, వ్యూస్ కోసం కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. తమ ఇంట్లో ఉండే పెట్స్ తో ఫన్నీ ఫన్నీగా రీల్స్, డాన్స్ చేస్తుంటారు. కుక్కపిల్లలు, పిల్లులు, పక్షులతో, ఆవులు, మేకలు ఇలా తమ పరిసరాల్లో ఉండే జంతువులతో కామెడీగా వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ జంతువులు తిరిగి వారిపై దాడి చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ అమ్మాయి తమ ఇంటి దగ్గర ఉండే గేదే ముందు డ్యాన్స్ చేసి వీడియో చేయాలనుకుంది. కానీ ఆ గేదే ఆమెకు ఊహించని షాకిచ్చింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అందులో ఓ అమ్మాయి.. తమ ఇంటి దగ్గర ఉండే పశువులకు మేత వేయడానికి వచ్చింది. పక్కనే ఉన్న తొట్టిలో మేత వేసి అనంతరం ఎద్దు ముందే ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసింది. అయితే తన ముందు డ్యాన్స్ చేస్తున్న యువతిని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న మరో తొట్టిలో పడిపోయింది. మళ్లీ లేవలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.