Funny Video: దొంగ-పోలీసు ఆటాడిన రెండు తాబేళ్లు.. గెలుపు ఎవరిదో చూస్తే షాక్ అవుతారు..!

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని జంతువులు చేసే అల్లరి నెటిజన్లను

Funny Video: దొంగ-పోలీసు ఆటాడిన రెండు తాబేళ్లు.. గెలుపు ఎవరిదో చూస్తే షాక్ అవుతారు..!
Turtle

Updated on: May 04, 2022 | 7:48 PM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని జంతువులు చేసే అల్లరి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే వాటినిన ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. మళ్లీ మళ్లీ ఆ వీడియోలను చూడాలనిపిస్తుంటుంది. అడవిలో జీవించే జీవుల జీవన శైలి ఒక రకంగా ఉంటే.. నీటిలో జవించే జీవుల జీవన శైలి మరోరకంగా ఉంటుంది. ముఖ్యంగా సముద్ర జీవుల జీవన విధానం బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఇటీవల రెండు తాబేళ్లకు సంబంధించి బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రెండు తాబేళ్లు దొంగ-పోలీసు ఆట ఆడుకుంటూ మస్తీ చేస్తున్నాయి.

నీటి అడుగున రెండు తాబేళ్లు సరదాగా ఆడుకుంటున్నాయి. అచ్చం మనుషుల మాదిరిగానే దొంగ-పోలీసు ఆట ఆడుకున్నాయి. అందులో ఒక తాబేలు ముందు పరుగెడుతున్నట్లుగా వేగంగా ఆదుతుండగా.. మరొక తాబేలు దానిని పట్టుకునేందుకు తెగ ప్రయత్నించింది. నీటితో వేగంగా ఈదుతూ పోటాపోటీగా పరుగులు తీశాయి. రెండు తాబేళ్ల సరదా ఆటకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంత క్యూట్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు వ్యూస్ కూడా విపరీతంగా వస్తున్నాయి. తాబేళ్ల దొంగ పోలీస్ ఆట సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేస్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

courtesy: 6abc

ఇవి కూడా చదవండి

Loading...
Unable to load recommendations.
Follow Us