Sport Biker Stunt with Girls: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొంతమంది బైక్‌లపై స్టంట్లు చేస్తూ అలరిస్తుంటారు. జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసినా.. ప్రెస్టైజ్‌కి వెళ్లి నవ్వుల పాలవుతుంటారు. అలాంటిదే.. ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్‌తో అమ్మాయిలతో చేసిన రైడింగ్ కాస్త.. నవ్వులు తెప్పిస్తుంది. చివరకు ప్రమాదంలో పడిన తీరుపై అందరూ నవ్వుకోవడంతోపాటు.. పలు కామెంట్లు కూడా చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చాలా మంది వ్యక్తులు తమ స్పోర్ట్స్ బైక్‌లతో ఒకే చోట నిల్చొని ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఆ తర్వాత అక్కడ రేస్ జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ బైకర్.. అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతుంది. బైక్‌పై యువతులిద్దరూ ముందు, వెనుక కూర్చొంటారు. బైకర్‌కు ఒక్కసారిగా జోష్ వస్తుంది. ఆ తర్వాత బైకర్ విన్యాసాలు చూపించడానికి బదులు బొక్కబోర్లాపడతాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వైరల్ వీడియో..
— The Darwin Awards? (@AwardsDarwin_) December 1, 2021
బైక్‌పై అమ్మాయిలు కూర్చోగానే బైకర్ విన్యాసాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఆ వ్యక్తి బైక్ రేసును పెంచిన వెంటనే.. బైక్ అదుపు తప్పి ముందు పార్క్ చేసిన బైక్‌ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బైకర్‌తోపాటు.. అమ్మాయిలిద్దరూ కూడా సమీపంలో పార్క్ చేసిన ఇతర బైక్‌లపై పడిపోయారు. అయితే.. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. దీంతోపాటు పలు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో డార్విన్ అవార్డ్స్ పేరుతో ఒక పేజీ షేర్ చేసింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడి తీసిందనేది తెలియరాలేదు.
Also Read: