Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!

|

Mar 15, 2022 | 5:57 AM

Funny Video: సినిమాలలో స్టంట్స్‌ చూసిన కొంతమంది తాము కూడా అలా చేయాలనుకుంటారు. దీంతో వాటిని ప్రాక్టీస్ లేకుండా ప్రయత్నిస్తారు. ఇంకేముంది ప్రమాదాలకు

Funny Video: తలకాయ పగిలే స్టంట్‌ అవసరమా.. మీరు ట్రై చేయకండి సుమా..!
Funny Video
Follow us on

Funny Video: సినిమాలలో స్టంట్స్‌ చూసిన కొంతమంది తాము కూడా అలా చేయాలనుకుంటారు. దీంతో వాటిని ప్రాక్టీస్ లేకుండా ప్రయత్నిస్తారు. ఇంకేముంది ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతారు. వాస్తవానికి ఏదైనా స్టంట్ చేయడానికి కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడే అందులో విజయం సాధిస్తారు. కొంతమంది సినిమాలో హీరో మాదిరి బ్యాక్‌ఫ్లిప్ కొట్టడానికి ట్రై చేస్తారు. అయితే ఇది అందరికి సాధ్యం కాదు. కాకపోతే ఇంట్రెస్ట్‌ ఉన్నవారు కొంచెం త్వరగా నేర్చుకోగలరు. ఎటువంటి ప్రాక్టీస్‌ లేకుండా మాత్రం చేయడం సాధ్యంకాదు. అయితే ఇలాంటి స్టంట్‌లకి సంబంధించిన చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో నిత్యం వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఒక స్టంట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనికి సంబంధించిని విషయాలు తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక అబ్బాయి బ్యాక్‌ఫ్లిప్‌ కొట్టడానికి ప్రయత్నించడం మనం గమనించవచ్చు. మొదట్లో నార్మల్ స్టంట్ చేస్తాడు. ఆ తర్వాత బ్యాక్‌ఫ్లిప్ కొట్టడానికి ట్రై చేయగా కుదరదు. తల నేలపై ఉన్న ఇనుప రాడ్డుకి బలంగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. బలమైన దెబ్బ తగలడంతో అతడు కొన్ని సెకన్ల పాటు నేలపైనే విలవిలలాడుతాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చి అతనిని పైకి లేపుతాడు. ప్రజలు ఈ వీడియోను చాలా ఫన్నీగా ఫీలవుతున్నారు.

ఈ ఫన్నీ వీడియో ఇప్పటివరకు 52 మిలియన్ల వీక్షణలను పొందింది. అయితే 2 మిలియన్లు అంటే 20 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను ఇష్టపడ్డారు. చాలామంది వీడియో చేసిన తర్వాత రకరకాల కామెంట్లు చేశారు. ‘స్టంట్ రాంగ్’ అని ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. మరొకరు ‘బ్రదర్‌.. తల పగిలింది’ అని రాశాడు. అదేవిధంగా ఇంకొక నెటిజన్‌ ‘అందుకే నేను యూట్యూబ్ నుంచి నేర్చుకోవడం మానేయండి’ అని తెలిపారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ స్పందనని తెలియజేయండి.

Minister Perni Nani Comments: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఫైర్..

Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి తప్పనిసరి.. అప్పుడే ఈ రోగాలు దూరం..!

ఈ పథకంలో నెల నెలా రూ.10,000 డిపాజిట్‌ చేయండి.. సులభంగా రూ.16 లక్షలు పొందండి..!