ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బస్సు ఎక్కే దగ్గర నుంచి సీటు దొరికి కూర్చునే వరకూ ఓ మినీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. పల్లెటూరు నుంచి పట్టణం వరకు చాలామంది ప్రజలు ఇలాంటి యుద్ధం చేస్తుంటారు. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫార్మ్‌పైకి బస్సు రాకముందే.. అల్లంత దూరం నుంచి ఆ బస్సు వెంట పరిగెత్తుతూ.. కిటికీలో నుంచి కర్చీఫూలు, లేదా మన బ్యాగులు వేస్తూ సీటును ఆపుకుంటూ ఉంటారు జనాలు. ఒకవేళ బస్టాండ్‌లోకి వచ్చినా.. సీటు దొరకదేమోననే అనుమానంతో కొంతమంది కిటీకీలలో నుంచి తమ లగేజీని విసిరేసి.. పక్కవారికి ‘ఈ సీట్ తమదని చెబుతారు’ కాస్త చూడమని కోరుతారు. అయితే ఇక్కడ భార్యాభర్తలు సీట్ కోసం నెక్స్ట్ లెవెల్‌లో విన్యాసం చేశారని చెప్పాలి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ భర్త బస్సులోని చివరి సీటులో ఎక్కుతాడు. ఆ తర్వాత భార్య తనకిచ్చిన సామాన్లను అందులో ఉంచుతాడు. ఇక భర్త కిటికీలో నుంచి వచ్చేయమనడంతో ముందుగా ఆ మహిళ చెప్పులను అతడికి ఇస్తుంది. ఆ తర్వాత భర్త చెయ్యి అందివ్వడంతో.. అతడి సహాయంతో లోపలికి వెళ్లిపోతుంది. వీరి విన్యాసం చూసిన ఇతరులు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, ఈ వీడియోను ‘memecentral.teb’ అనే ఇన్‌స్టా ఖాతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. కొంతమంది అలా చేయడం చాలా ప్రమాదం అని కామెంట్ చేయగా.. మరికొందరు జూగాడ్ ఉంటే.. ఏదైనా సాధ్యమవుతుందని కామెంట్ చేశారు.