AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ కంప్యూటర్‌లో వైరస్.. 100కు పైగా TikTok వీడియోల్లో గుట్టంతా రట్టు! చివరకు అరెస్ట్!

అమెరికాలో సైబర్ నేరానికి సంబంధించి సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కంప్యూటర్‌లోకి అనధికారికంగా ప్రవేశించి, ఆమె వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, వందకు పైగా TikTok వీడియోల ద్వారా బయటపెట్టిన 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళకు తెలియకుండా ఆమె కంప్యూటర్‌ను యాక్సెస్ చేయడంతో పాటు, పాస్‌వర్డ్‌లు, ప్రైవేట్ సంభాషణలు, లొకేషన్ వివరాల పూర్తి సమాచారాన్ని పొందగలిగాడు.

మహిళ కంప్యూటర్‌లో వైరస్.. 100కు పైగా TikTok వీడియోల్లో గుట్టంతా రట్టు! చివరకు అరెస్ట్!
Florida Man Arrested After Placing Virus On Woman Computer
Sharada V
|

Updated on: Oct 08, 2026 | 5:48 PM

Share

ఓ మహిళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో వందకు పైగా వీడియోలను TikTok లో పోస్ట్ చేసాడు. వీడియోల్లో పాస్‌వర్డ్‌లు, ఫోన్ ఇతర పరికరాలకు సంబంధించిన వివరాలు, కొనుగోళ్లు, లొకేషన్ ను ప్రస్తావించాడు.

కంప్యూటర్ సమస్య పరిష్కరిస్తానని చెప్పి వైరస్ ఇన్‌స్టాల్

అక్టోబర్‌లో తన కంప్యూటర్‌లోని ఓ అప్లికేషన్ సమస్యను పరిష్కరించేందుకు ఆసియా రిమోట్ యాక్సెస్ ద్వారా ఆమెకు సహాయం చేసాడు. ఆ తర్వాత తనకు తెలియకుండా కంప్యూటర్‌లో ఓ ప్రోగ్రామ్ లేదా వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చని ఆమె అనుమానిస్తోంది. దాని ద్వారా తన అనుమతి లేకుండానే కంప్యూటర్‌ను తిరిగి యాక్సెస్ చేసి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేసింది. తన ప్రైవేట్ సంభాషణలో ఉన్న ఓ ఫొటో ఆ తర్వాత ఆసియా TikTok వీడియోలో కనిపించడంతో ఆమె షాకైంది.

మహిళ వ్యక్తిగత సమాచారాన్ని ఆసియా ఎలా పొందాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆమె ఎక్కడ ఉందో గుర్తించడానికి ఉపయోగపడే లొకేషన్ సమాచారం అతని వద్ద ఉంది. ప్రైవేట్ మెసేజ్‌లు, ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లను అనుమతి లేకుండా పొందాడు.

ఆసియా తన ఆన్‌లైన్ ప్రొఫైల్‌లో తానొక సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌ అనీ, ‘గ్రే హ్యాట్ హ్యాకర్’, ‘డెమోనాలజిస్ట్’ కూడా అనీ పేర్కొన్నాడు. ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలోని నివాసం నుంచి మార్క్ స్టీఫెన్ ఆసియాను అరెస్ట్ చేసి సెప్టెంబర్ 30న కౌంటీ జైలులో అధికారులు నిర్బంధించారు. అతనిపై కంప్యూటర్‌ను అనధికారికంగా యాక్సెస్ చేసిన అభియోగం నమోదైంది బెయిల్ మొత్తాన్ని 35,000 డాలర్లుగా నిర్ణయించారు.

ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం

దర్యాప్తులో భాగంగా ఆసియా నివాసంలో సోదాలు నిర్వహించి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, USB స్టోరేజ్ పరికరాలు, ఐప్యాడ్, డెల్ ల్యాప్‌టాప్‌తో పాటు నెట్‌వర్కింగ్ పరికరాలు ఉన్నట్లు సమాచారం. ఈ పరికరాల్లోని డేటాను పరిశీలించడం ద్వారా మహిళ పాస్‌వర్డ్‌లు, సందేశాలు, ఆన్‌లైన్ ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీల సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ డేటా వంటి వివరాలు ఎలా సేకరించాడో అధికారులు తెలుసుకుంటున్నారు.

గతంలోనూ అరెస్ట్.. మళ్లీ తెరపైకి కేసు

ఆసియాపై గతంలోనూ క్రిమినల్ దర్యాప్తు జరిగింది. ఓ మహిళ స్టాకింగ్ నుంచి రక్షణ కోరుతూ సివిల్ కేసు దాఖలు చేసింది. జూలైలో తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ఆ కేసు తర్వాత కొట్టివేయడంతో సెప్టెంబర్‌లో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. 2026 ఏప్రిల్‌లో స్టాకింగ్, అనధికారిక కంప్యూటర్ యాక్సెస్ ఆరోపణలతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే, మే నెలలో ప్రాసిక్యూటర్లు అప్పట్లో పరిశీలనలో ఉన్న అభియోగాలను ముందుకు తీసుకెళ్లలేదు. దానిని కోర్టు ప్రక్రియలో ‘No Information’గా పేర్కొన్నారు.   అయితే తాజాగా మహిళ కేసులో సెప్టెంబర్ 24న ప్రాసిక్యూటర్లు కొత్త అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఈసారి ప్రధానంగా కంప్యూటర్ ను అనుమతి లేకుండా యాక్సెస్ చేశాడనే ఆరోపణపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఆసియాను జైలులో నిర్బంధించి, 35,000 డాలర్ల బెయిల్‌ను నిర్ణయించారు. తదుపరి విచారణలో భాగంగా  నవంబర్ 19న కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.

Follow Us