అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ పిల్లాడి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.!

| Edited By: Ravi Kiran

Apr 01, 2024 | 12:59 PM

సాధారణంగా చేప నీటి నుంచి బయటకు వచ్చి ఊపిరి ఆడక గిలగిల్లాడుతుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ చేప చెరువులో ఈత కొడుతున్న బాలుడి గొంతులోకి అనూహ్యంగా దూరింది. అనుకోని ప్రమాదంతో చేప గొంతుకు అడ్డంగా ఇరుక్కోవడంతో ఆ బాలుడు ఊపిరి ఆడక విలవిల్లాడాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ పిల్లాడి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.!
Representative Image
Follow us on

సాధారణంగా చేప నీటి నుంచి బయటకు వచ్చి ఊపిరి ఆడక గిలగిల్లాడుతుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ చేప చెరువులో ఈత కొడుతున్న బాలుడి గొంతులోకి అనూహ్యంగా దూరింది. అనుకోని ప్రమాదంతో చేప గొంతుకు అడ్డంగా ఇరుక్కోవడంతో ఆ బాలుడు ఊపిరి ఆడక విలవిల్లాడాడు. చివరికి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన ఛతీస్‌గడ్ రాష్టంలో చోటు చేసుకుంది. ఛతీస్‌గడ్ రాష్ట్రం జాంజ్‌గీర్ చాంపా జిల్లాలోని అకల్తారా పోలీస్ స్టేషన్ పరిధి కరుమహు గ్రామానికి చెందిన సమీర్ గొడ్ అనే 14 ఏళ్ల బాలుడు ఈత కోసం స్థానిక చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో చెరువులోని చేప అతని గొంతులోకి అనూహ్యంగా వెళ్ళి ఇరుక్కుపోయింది. ఊహించని పరిణామంతో బాలుడు భయపడి చెరువు గట్టుకు వచ్చాడు. స్థానికులు గొంతులో ఇరుక్కున్న చేపను బయటికి తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

ఎంతకీ ఫలితం లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సగం చేపను మాత్రమే వైద్యులు బయటికి తీయగలిగారు. బాలుడి పరిస్థితి విషమించడంతో ముందస్తు సమాచారం ఇచ్చి అతన్ని బిలాస్‌పూర్ తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి మిగతా చేపను బయటికి తీశారు. చేప వల్ల అతడికి పెద్దగా గాయాలేవీ కాలేదని, సర్జరీ తర్వాత రెండు రోజులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు తెలిపారు. చేప పూర్తిగా శ్వాసకోశ ద్వారాన్ని మూసి వేయకపోవడం వల్ల అతడు కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం దొరికిందని, ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్ రామకృష్ణ కాశ్యప్ తెలిపారు.

వీడియో 1:

 

 

వీడియో 2: