Viral Video: సింహంపై దాడికి నేను రెడీ.. వీడియోలో కుక్క ఫోజులు చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..

నేను లోపలుంటే మీరు సేఫ్.. నేను బయటకొస్తే మీకు హడల్.. ఇది అడవిలోని పులి పాటించే ధర్మం. అదే రీతిలో ఉంటుంది పులి స్టైల్. ఈ మధ్య కాలంలో..

Viral Video: సింహంపై దాడికి నేను రెడీ.. వీడియోలో కుక్క ఫోజులు చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..
Fearless Dog Tries

Updated on: Dec 07, 2021 | 12:52 PM

నేను లోపలుంటే మీరు సేఫ్.. నేను బయటకొస్తే మీకు హడల్.. ఇది అడవిలోని మృగం ధర్మం. అదే రీతిలో ఉంటుంది సింహం స్టైల్. ఈ మధ్య కాలంలో చాలా మంది కోవిడ్ భయంతో ఫాంహౌస్‌‌లకు పరుగులు తీస్తున్నారు. ఆ ఫామ్ హౌస్‌లు ఉండేది ఊరికి చివరలో అంటే అడవికి దగ్గరలో.. అలాంటి చోటు అడప దడప క్రూరమృగాలు హలో..! హాయ్..! చెబుతుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఈ మధ్య జరిగింది. ఇలా ఆడ సింహం ఇంటికి వచ్చిన సమయంలో జరిగిన ఘటనను వీడియోలో రికార్డ్ అయ్యింది. సింహం వారి ఇంటికి వచ్చిన సమయంలో దానిని ఎదుర్కొనేందుకు ఆ ఇంటి బొచ్చు కుక్క రెడీ ఉంది. ఏ నిమిషంలోనైనా అది దాడి చేస్తే తిప్పి కొట్టేందుకు.. కాని ఇక్కడే అసలు ట్విస్ట్.. ఈ రెండింటి మధ్య గోడలా గ్లాస్ ఉంది. అదే దైర్యంతో దూకుడు మీదుంది ఆ ఇంటి సింహం. 

వాటి మధ్య గాజు గోడ లేకపోతే కుక్క సులభంగా విందు అయ్యేంది. ఈ వింత దృశ్యాన్ని ఇంటి యజమాని సారా బోలే డిసెంబర్ 2న సాయంత్రం పని నుండి తిరిగి వచ్చిన తర్వాత రికార్డ్ చేసింది. కుక్క కూర్చుని నిశ్శబ్దంగా సింహాన్ని గమనిస్తున్న క్షణాన్ని దృశ్యాలను సారా చిత్రీకరించింది. ఆమె డాష్‌ని తన వద్దకు పిలవడానికి ప్రయత్నించింది. కానీ అది మాత్రం కదలకుండా అలానే దాడికి రెడీ ఉంది.

వీడియో చూడండి:

ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పులితో పోరాడేందుకు రెడీ ఉన్న బొచ్చు కుక్కను చూసి శభాష్ అంటున్నారు. కుక్క దైర్యంను మొచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..