Viral Video: అయ్య బాబోయ్‌ వీళ్లేం మనుషులురా సామీ..! భారీ కొండచిలువలతో తండ్రీకూతుళ్ల సాహసం

ఇద్దరు వ్యక్తులు భారీ కొండచిలువలను భుజాలపై వేసుకుని మోసుకు వెళ్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది నమ్మశక్యంగా లేదని కొందరు అంటుంటే..వామ్మో వీళ్ల ధైర్యం మాటల్లో చెప్పలేనిది అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

Viral Video: అయ్య బాబోయ్‌ వీళ్లేం మనుషులురా సామీ..! భారీ కొండచిలువలతో తండ్రీకూతుళ్ల సాహసం
Massive Pythons

Updated on: Sep 21, 2024 | 2:41 PM

పాములంటే దాదాపు ప్రతి ఒక్కరికీ భయం. పాము పేరు చెబితేనే భయంతో వణికిపోయేవారు కూడా ఉంటారు. వన్యప్రాణులలో అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించేవి పాములు. అయితే, పాములతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఆ వీడియోలో కనిపించిన సీన్‌ చూస్తే ఎవరికైనా సరే భయంతో ఒళ్లు గగ్గుర్పాటుకు గురి కావాల్సిందే..అంత భయంకరంగా ఉంటుంది ఆ వీడియో. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో ఇద్దరు వ్యక్తులు భారీ కొండచిలువలను భుజాలపై వేసుకుని మోసుకు వెళ్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది నమ్మశక్యంగా లేదని కొందరు అంటుంటే..వామ్మో వీళ్ల ధైర్యం మాటల్లో చెప్పలేనిది అంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. ది రెప్టైల్ జూ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వీడియో షేర్ చేయబడింది. అయితే, ఇక్కడ అరుదైన పాములు, కొండచిలువను సంరక్షిస్తారని తెలిసింది. వీడియోలో కనిపించిన ఆ ఇద్దరు సదరు సంస్థ వ్యవస్థాపకులు జే బ్రూవర్, అతని కుమార్తె జూలియట్‌గా తెలిసింది. వీడియోలో వారిద్దరూ తమ భుజాలపై భారీ కొండచిలువలను ఎలాంటి భయం లేకుండా మోస్తున్నారు.

ఈ వీడియో చూడండి…

ఈ వీడియోని ఇప్పటి వరకు కోటి మందికి పైగా వీక్షించారు. వీడియోలో కొండచిలువల పరిమాణం ప్రతిఒక్కరినీ షాక్‌ అయ్యేలా ఉంది. అంత భారీ సైజులో ఉన్న కొండచిలువలను ఆ ఇద్దరూ తమ భుజాలపై పెట్టుకుని నడుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..