
Viral Video: టెన్షన్స్, స్ట్రాస్ తగ్గాలంటే నవ్వించే వీడియోలు.. ఆసక్తికర పజిల్స్ చాలా ఉపయోగపడుతాయి. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల్లో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వీటీలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే జంతువుల ప్రవర్తన భలే చిత్రంగా ఉంటుంది. చాలా సార్లు జంతువులు చేసే పనులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఏనుగు చేసిన పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకు ఆ ఏనుగు ఏం చేసిందో తెలుసా..?
ఏనుగులకు సంబంధించిన వీడియోలు చాలా వరకు భయాన్ని కలిగించేవే ఉంటాయి. అయితే కొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి నిర్మానుష ప్రాంతంలో నిలుచొని ఎదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అతని వెనుకనుంచి ఓ భారీ గజరాజు నడుచుకుంటూ వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం శబ్దం చేయకుండా ఆ ఏనుగు అతడి వైపు వచ్చింది. అతని దగ్గరకు రాగానే ఆ ఏనుగు దాని కాలితో ఇక్కడ కింద ఉన్న మట్టిని తన్నింది దాంతో అతడు ఏమైంది అన్నట్టుగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఉన్న భారీ ఏనుగును చూసి ఒక్కసారిగా పరుగందుకున్నాడు. ఆతర్వాత అది దాని దారిలో వెళ్లిపోయింది. నా దారికే అడ్డుగా ఉంటావా అన్నట్టు ఏనుగు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్నిట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి