వావ్‌.. వన్స్ మోర్ గజేంద్ర..! డప్పు, డోలు దరువులకు చిందులేస్తున్న గజరాజు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు..

|

Feb 05, 2024 | 12:40 PM

గజరాజు ఈ డ్యాన్స్ వీడియో @WokePandemic హ్యాండిల్‌తో సోషల్ మీడియా Xలో భాగస్వామ్యం చేయబడింది . వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, వినియోగదారు క్యాప్షన్‌లో వ్రాశారు - "సనాతన సంస్కృతి మాత్రమే జంతువులను సంతోషంగా ఉంచగలదు" అని వ్యాఖ్యనించారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఇదంతా అతీంద్రియ, అద్భుతమైన దృశ్యంగా వర్ణించారు.

వావ్‌.. వన్స్ మోర్ గజేంద్ర..! డప్పు, డోలు దరువులకు చిందులేస్తున్న గజరాజు.. వీడియో చూస్తే ఫిదా అవుతారు..
Elephant Funny Dancing
Follow us on

ప్రతిరోజూ అనేక ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలలో చాలా డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. డ్యాన్స్ సంబంధిత వీడియోలలో, కొన్నిసార్లు తాతలు, కొన్నిసార్లు అమ్మమ్మలు, మామలు, ఆంటీలు అద్దిరిపోయే పాటలకు డ్యాన్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. అయితే, అలాంటి మ్యూజిక్‌ ప్లే అవుతుండగా జంతువులు డ్యాన్స్‌ చేయటం మీరు ఎప్పుడైనా చూశారా..? అవును, జంతువులు డప్పు డోలు వాయిద్యాల దరువులకు డ్యాన్స్ చేయడం చూశారా? మీరు చూడకుంటే ఇప్పుడే చూడండి. ఇక్కడ ఒక ఏనుగు డోలు, డప్పు దరువులకు లయబద్ధంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

ఏనుగు చుట్టూ జనం గుమిగూడి కూడా వీడియోలో మనం చూడవచ్చు. ఇక్కడ డ్యాన్స్‌తో అదరగొడతున్న గజరాజును అందంగా అలంకరించారు. ఏనుగు చుట్టూరా జనం నిలబడి ఉన్నారు. కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ డాన్స్ చేస్తున్నారు. దీనితో పాటు, ఆ గజరాజు సైతం డ్రమ్ దరువులతో పాటు తన పాదాలను కదుపుతూ డ్యాన్స్‌ చేయటం వీడియోలో కనిపిస్తుంది. ఏనుగు చుట్టూ నిలబడిన ఉన్న వ్యక్తులు కూడా ఏనుగుతో కలిసి నృత్యం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో పండగ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏనుగు డ్యాన్స్ వీడియోని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

గజరాజు ఈ డ్యాన్స్ వీడియో @WokePandemic హ్యాండిల్‌తో సోషల్ మీడియా Xలో భాగస్వామ్యం చేయబడింది . వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, వినియోగదారు క్యాప్షన్‌లో వ్రాశారు – “సనాతన సంస్కృతి మాత్రమే జంతువులను సంతోషంగా ఉంచగలదు” అని వ్యాఖ్యనించారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఇదంతా అతీంద్రియ, అద్భుతమైన దృశ్యంగా వర్ణించారు. మరొకరు స్పందిస్తూ.. మీరు ఇంతకు ముందు ఇలాంటి ఏనుగును చూశారా అంటూ అడుగుతున్నారు. మరికొందరు.. వ్యాఖ్యానిస్తూ.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు రాశారు… ఈ వీడియోను ఇప్పటికే 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోని యూజర్లు విరివిగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..