
వణ్యప్రాణులతో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకతంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి అడవిలో స్వేచ్ఛగా తిరుగే జంతువుల దగ్గరకు మనమే వెళ్లి వాటిని ఇబ్బంది పెడుతుంటాం. అందుకే వాటికి ఏమాత్రం తేడా అనిపించినా వెనకాముందు చూడకుండా దాడి చేస్తుంటాయి. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజగా ఇలాంటి ఓ ఘటనే కేరళలో జరిగింది. ఓ ఏనుగు ఏకంగా టూరిస్టును తొక్కి చంపబోయింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని బందీపూర్ నేషనల్ పార్కులోని హైవేపే కొందరు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో వారికి పక్కన అడవిలో ఓ ఏనుగు కనిపించింది. అంత భయంకరమైన జంతువనే విషయాన్ని కూడా పక్కన పెట్టి, దాంతో ఫొటో దిగాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. కారు దిగి ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. దీంతో వెర్రెక్కి పోయిన ఏనుగు ఒక్కసారిగా ఇద్దరిని వెంటాడింది. దీంతో బతుకు జీవుడా అంటూ ఇద్దరూ ఒకటే పరుగు లంకించుకున్నారు. కారు ఎక్కేందుకు ఎంత ప్రయత్నించినా ఏనుగు దూసుకొచ్చింది.
The reason why you shouldn’t mess with the largest land animal on planet earth.
A scene from Bandipur-Wayanad National Highway.
— Manas Muduli🇮🇳 (@manas_muduli) February 1, 2024
పరిగెడుతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఏనుగు ఆ వ్యక్తి తొక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఏనుగుకు తొలుత మిస్ అయ్యింది. మళ్లీ వెనక్కి వెళ్లి ఆ వ్యక్తిని తొక్కేందుకు ప్రయత్నించింది. అయితే అంతలోనే ఆ వ్యక్తి పక్కకు తప్పుకొని అడవిలోకి జారుకున్నాడు దీంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. దీనంతటినీ మరో కారులో వెళ్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేసి ట్వీట్ చేయడంతో వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఏనుగుతో గేమ్స్ ఆడడం అవసరమా, సెల్ఫీల కోసం ప్రాణాలు పణంగా పెడతారా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..